Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ ను మెచ్చుకున్న మోడీ

By:  Tupaki Desk   |   31 Dec 2015 12:14 PM GMT
కేసీఆర్‌ ను మెచ్చుకున్న మోడీ
X
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ను అభినంద‌న‌లు తెలిపారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా అయుత చండీయాగం నిర్వహించిన సంగ‌తి తెలిసిందే. నియ‌మ‌నిష్టలతో విజ‌య‌వంతంగా యాగం నిర్వ‌హించడం సంతోషదాయకమని మోడీ కొనియాడారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌ కు మోడీ లేఖ రాశారు. యాగం వల్ల లోకకల్యాణం - విశ్వశాంతి - ఆధ్యాత్మికత చేకూరుతాయని మోడీ త‌న లేఖ‌లో అభిప్రాయ‌ప‌డ్డారు. యాగం విజయవంతం కావడం పట్ల మోడీ అభినందనలు తెలిపారు.

అయితే ఈ లేఖ‌లో ఎక్క‌డా త‌ను రాక‌పోవ‌డానికి మోడీ కార‌ణాలు తెలుప‌లేద‌ని స‌మాచారం. హిందూ మ‌తం స‌త్తాను చాటేలా కేసీఆర్ నిర్వ‌హించిన యాగంను అభినందిస్తూ మోడీ లేఖ రాయ‌డం అభినంద‌నీయ‌మేన‌ని ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు.