Begin typing your search above and press return to search.
రైతు చట్టాలను చదవండి.. షేర్ చేయండి: మోడీ విజ్ఞప్తి
By: Tupaki Desk | 19 Dec 2020 5:00 PM GMTకొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని గత కొన్ని రోజులుగా రైతులు దేశ రాజధాని ఢిల్లీలో ఆందోళనలు హోరెత్తిస్తున్నారు. కేంద్రం చర్చలు జరిపినా వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే దేశవ్యాప్తంగా ఈ ఉద్యమం వ్యాపించకుండా మోడీ సర్కార్ నష్టనివారణ చర్యలు చేపట్టింది.
తాజాగా నూతన వ్యవసాయ చట్టాలపై కేంద్రం విడుదల చేసిన బులిటెన్ ను అందరూ చదవాలని ప్రధాని మోడీ దేశ ప్రజలను కోరారు. కేంద్రం రూపొందించిన ఈ-బుక్ లెట్ లో వ్యవసాయ చట్టాల గురించి విస్తృత సమాచారం ఉందని.. ఆ చట్టాలు రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతాయో గ్రాఫిక్స్ రూపంలో తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు.
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ వ్యవసాయ చట్టాలపై రాసిన లేఖ నమో యాప్ లో కూడా ఉందని.. దీన్ని అందరూ షేర్ చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రజలను కోరారు.
రైతుల ఆందోళన దేశవ్యాప్తంగా హోరెత్తుతున్న వేళ వ్యవసాయ చట్టాలపై కేంద్రం ఈ కొత్త ఎత్తు వేసింది. గురువారం బుక్ లెట్ విడుదల చేసింది. నూతన వ్యవసాయ చట్టాల వల్ల రైతులు పొందే లాభాలు, అవి లేకపోవడం వల్ల కలిగే నష్టాల గురించి ఈ బుక్ లెట్ లో పేర్కొన్నారు. కొత్త చట్టాల అమలు అనంతరం ఒప్పంద వ్యవసాయం వల్ల లాభపడ్డ రైతుల విజయాలను వివరించారు.
https://twitter.com/narendramodi/status/1340259769471275009?s=20