Begin typing your search above and press return to search.
అందరికి ఉచిత టీకా ఓకే.. దాని లెక్కేంది మోడీ సాబ్?
By: Tupaki Desk | 8 Jun 2021 2:42 AM GMTప్రధాని మోడీ మాటల్లో మర్మాన్ని గ్రహించటం అంత తేలికైన విషయం కాదు. ఆయన మాటలు విన్నంతనే ఎంతో సంతోషం.. మరెంతో ఆనందాన్ని కలిగించేలా ఉంటాయి. చాలా వాణిజ్య కంపెనీలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ప్రకటన ఊరిస్తుంది కానీ.. దాని పైన చిన్న నక్షత్రం.. దాని అర్థం నిబంధనలు వర్తిస్తాయన్నట్లుగా మోడీ మాటలు ఉంటాయనే చెప్పాలి. తాజాగా ఆయన దేశంలోని ప్రజలందరికి ఉచితంగా టీకా ఇస్తానని.. కేంద్రమే పూర్తి బాధ్యత తీసుకుంటుందని.. నవంబరు నాటికి దేశంలో 80 శాతం మందికి వ్యాక్సినేషన్ ప్రక్రియను పూర్తి చేస్తామంటూ చెప్పిన మాటలు ఆల్ ఈజ్ వెల్ అన్నట్లుగా ఉంటాయి.
కానీ.. లోతుల్లోకి వెళ్లినప్పుడు అసలు లెక్కలు బయటకు వస్తాయి. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75 శాతం కేంద్రం తీసుకొని.. వాటిని రాష్ట్రాలకు ఇస్తామని ప్రధాని చెప్పారు. మిగిలిన 25 శాతం ప్రైవేటుకు అమ్ముకోవచ్చని చెప్పారు. కేంద్రం టీకాను ఉచితంగా ఇస్తే.. ప్రైవేటు వారు ఒక్కో టీకాకు రూ.1200నుంచి రూ.1400 వరకు వసూలు చేసుకునే వీలు ఉంది. ఇంతవరకు ఓకే. రాష్ట్రాలకు అవసరమైన టీకాల్ని ఇస్తామని చెప్పిన మోడీ.. ఏ లెక్కన ఇస్తారు? అన్న ప్రశ్నకు సమాధానం చెప్పలేదన్నది మర్చిపోకూడదు.
రాష్ట్రాల జనాభా ప్రకారం ఇస్తారా? ఇప్పటికే వ్యాక్సినేషన్ జరిగిన దాని లెక్కను తీసుకొని ఇస్తారా? లేదంటే.. ఆయా రాష్ట్రాల్లో నమోదయ్యే కేసుల ఆధారంగా ఇస్తారా? వైరస్ తీవ్రతను పరిగణలోకి తీసుకుంటారా? లాంటి ప్రశ్నలు తలెత్తక మానవు. జనాభా లెక్క ప్రకారం వ్యాక్సిన్లు ఇస్తే.. ఉత్తరప్రదేశ్ కు అత్యధిక వ్యాక్సిన్లు వెళతాయి. అదే విధంగా ఏ రాష్ట్రంలో జనాభా ఎక్కువ ఉంటుందో వారికి లబ్థి చేకూరుతుంది. అలా కాకుండా కేసుల ఆధారంగా ఇస్తే.. అప్పుడు కూడా లెక్కలు వేరేలా ఉంటాయి. మోడీ చెప్పిన ఉచిత వ్యాక్సిన్ మాటకు పొంగిపోకుండా.. వాటిని ఏ లెక్కన రాష్ట్రాలకు ఇస్తారన్నది కీలకం.అయితే.. ఈ విషయంపై కేంద్రం ఎలాంటి సమాచారం ఇవ్వలేదన్నది మర్చిపోకూడదు.