Begin typing your search above and press return to search.
బాబు కామెంట్లపై మోడీ సీరియస్
By: Tupaki Desk | 31 July 2016 8:06 AM GMTఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ-బీజేపీల మధ్య గ్యాప్ పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటు సాక్షిగా ప్రత్యేక హోదా లేదని పరోక్షంగా తేల్చేసిన సమయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. చంద్రబాబు ఆగ్రహంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆరా తీశారని సమాచారం.
అరుణ్ జైట్లీ ప్రకటన అనంతరం తెలుగుదేశం ఎంపీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ కు సహాయంపై కేంద్రంలోని పెద్దలు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే రక్తం మరుగుతోందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ రకంగా చంద్రబాబు ఘాటు ప్రసంగానికి సంబంధించి పత్రికల్లో వచ్చిన కథనాల కాపీలను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఢిల్లీకి తెప్పించుకున్నారని సమాచారం. అంతేకాదు పార్టీపరంగా కూడా వీటిపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని బీజేపీ సీనియర్ నేతలు బీజేపీ అధిష్టానం మాట్లాడిందని అంటున్నారు. ఫోన్ లో అమిత్ షాతో ప్రధాని మోడీ మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. ఇదిలాఉండగా టీడీపీపై విమర్శలు చేయవద్దని బీజేపీ నేతలను అమిత్ షా ఆదేశించారు. త్వరలో చంద్రబాబును ఢిల్లీకి పిలిపించి ప్రధాని మోడీ మాట్లాడే అవకాశం ఉందని తెలుస్తోంది.