Begin typing your search above and press return to search.
ఉగ్రవాదుల తాజా టార్గెట్ వీరేనట..!
By: Tupaki Desk | 21 Nov 2017 9:30 AM GMTగడిచిన కొద్ది రోజులుగా దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు కాస్త తగ్గాయి. జమ్ము కశ్మీర్ ను మినహాయిస్తే.. దేశంలో ఉగ్ర ఘటనలు పెద్దగా చోటు చేసుకున్నవి లేవు. అయితే.. వారు సరైన అదును కోసం చూస్తున్న విషయం తాజాగా బయటకు వచ్చింది. దేశంలో భారీ ఉగ్రదాడికి ప్లాన్ చేస్తున్న వైనం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
ప్రధాని మోడీ.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఇతర బీజేపీ ప్రముఖులు ఇప్పుడు ఉగ్రవాదుల హాట్ టార్గెట్ అన్న విషయం వెలుగు చూసింది. వారు పాల్గొనే బహిరంగ సభల్లో పెద్ద ఎత్తున హింసకు చోటు చేసుకునేలా పథకం వేస్తున్నట్లుగా నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి.
ఉగ్రవాదుల లక్ష్యంలో టాప్ ఫైవ్ ప్రముఖుల వివరాల్ని నిఘా వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ.. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్.. అరుణ్ జైట్లీ.. సుష్మా స్వరాజ్ లు టాప్ టార్గెట్ లుగా చెబుతున్నారు. వీరేకాక బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా.. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్.. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారీకర్ ల మీద కూడా ఉగ్రవాదులు కన్నేసినట్లుగా వెల్లడైంది.
వీరి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని.. వారు పాల్గొనే కార్యక్రమాల్ని మరింత క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించే కార్యక్రమాల్లో ఉగ్రదాడి జరిగే ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు. ఈ బీజేపీ ప్రముఖుల్ని జాగ్రత్తగా ఉండాలని.. వారికిచ్చే భద్రతను మరోమారు క్షుణ్ణంగా పరిశీలించాలని కోరాయి. ఉగ్రవాదుల తాజా టార్గెట్ నేపథ్యంలో ప్రముఖుల భద్రతను మరోసారి పునః సమీక్షిస్తున్నారు.