Begin typing your search above and press return to search.

బయటోళ్ల దగ్గర మోడీ అంతలా గొప్పలు చెప్పుకుంటారా?

By:  Tupaki Desk   |   12 Feb 2020 4:30 PM GMT
బయటోళ్ల దగ్గర మోడీ అంతలా గొప్పలు చెప్పుకుంటారా?
X
సమకాలీన భారతంలో తమ మాటలతో.. వాక్ చాతుర్యంతో దేశ ప్రజల మనసుల్ని దోచేయటమే కాదు.. మేజిక్ చేసిన అధినేతలు లేరనే చెప్పాలి. ప్రధాని మోడీ ఇందుకు మినహాయింపుగా చెప్పాలి. వేదిక ఏదైనా.. ఎప్పుడేం చెప్పాలో..? ఎలా చెప్పాలో ఆయనకు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదన్న మాట తరచూ వినిపిస్తూ ఉంటుంది. దీనికి తగ్గట్లే పలు జాతీయ.. అంతర్జాతీయ వేదికల మీద ఎప్పుడు ఫెయిల్ అయ్యింది లేదు. మోడీ మాట్లాడితే చాలు.. వినేవారంతా మంత్ర ముగ్దులు అయ్యేలా చేయటంలో ఆయనకు మించినోళ్లు ఉండరు.

మాటకారి మోడీ స్పీచులు ఇచ్చే వేళలో కాకుండా.. ప్రముఖులకు ఫోన్లు చేసిన మాట్లాడే వేళ.. ఆయన మాటలు అంతగా ఉండవా? అన్నది ఒక ప్రశ్న అయితే.. కొన్నిసార్లు అవసరానికి మించిన గొప్పల్ని ప్రదర్శిస్తారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నెలలో భారత పర్యటనకు రానున్న అమెరికా అధ్యక్షుడు..ఇటీవల తాను ప్రధాని మోడీతో జరిపిన ఫోన్ కాల్ సంభాషణ గురించి చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా తన కోసం భారత్ లోని ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని.. స్వాగతం చెప్పేందుకు వేలాది మంది సిద్ధంగా ఉన్నట్లు మోడీ తనతో చెప్పారని చెప్పారు. వాస్తవం ఏమిటన్నది అందరికీ తెలిసిందే. ఎంత ట్రంప్ వస్తే మాత్రం.. ఎగేసుకొని ఎయిర్ పోర్టులకు వెళ్లి.. అమెరికన్ల మాదిరి.. ట్రంప్.. ట్రంప్ అంటూ నినాదాలు చేయటం లాంటివి ఉండవనే చెప్పాలి.

కాకుంటే..ట్రంప్ హాజరవుతారనే కార్యక్రమానికి మామూలు కంటే కాస్త ఎక్కువగా హాజరయ్యే వీలుంది. అమెరికా అధ్యక్షుడి తో మాట్లాడే వేళ.. ప్రధాని మోడీ లాంటోళ్లు..ట్రంప్ కోసం భారతీయులు వెయిట్ చేస్తున్నారని.. ఆయన పర్యటన కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లుగా చెప్పారని చెప్పుకొచ్చారు. ట్రంప్ నోటి నుంచి వచ్చిన మాటలన్ని విన్నప్పుడు.. మోడీ లాంటి అధినేత ప్రపంచాధినేత కు ఫోన్ చేసిన మాట్లాడే వేళ.. అసలు తో పాటు పొగిడే కొసరు గుణం ఉందన్న విషయం ట్రంప్ మాటల్ని విన్నంతనే అర్థం కాక మానదు.