Begin typing your search above and press return to search.
కేసీఆర్ తీరుపై మోడీ, జైట్లీకి డౌట్ ఉందట
By: Tupaki Desk | 14 April 2017 12:49 PM GMTతెలంగాణాలోని 55లక్షల మంది రైతులకు ఉచితంగా ఎరువుల పంపిణీ చేయనున్నట్లు ప్రకటించి అందరి చూపును తనవైపు తిప్పుకొన్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన ద్వారా పాలనా సంస్కరణల్లోనూ భారత్ లోనే సరికొత్త ఆవిష్కరణలకు కేసీఆర్ తెరదీశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ మాఫీ పూర్తి చేసిన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా చేసిన ప్రకటన దేశంలోని ఇతర ముఖ్యమంత్రుల్తో పాటు ప్రధాని మోడి - ఆర్థిక మంత్రి జైట్లీ - వ్యవసాయ - ఆర్దికశాస్త్రజ్ఞుల్ని ఆశ్చర్యపరుస్తోందని అంటున్నారు. ఇప్పటికే ఉచిత విద్యుత్ ను అందిస్తున్న కేసీఆర్ వచ్చే ఏడాది నుంచి రైతులకు అవసరమైన దుక్కిమందు, ఎరువులను కూడా ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు వ్యవసాయ వ్యయం నిమిత్తం ఎకరానికి మరో నాలుగు వేలు ఇస్తామని ప్రకటించారు. ఇది ఆచరణ సాధ్యమేనా? ఏ విధంగా అమలు చేయగలుగుతారన్న సందేహాలిప్పుడు మోడీ - జైట్లీతో పాటు రిజర్వ్‌బ్యాంక్ అధికారులు - ఇతర నిపుణుల చర్చలకు తెరదీశాయని అంటున్నారు.
అయితే కేసీఆర్ సన్నిహిత వర్గాలు మాత్రం పక్కా ప్రణాళిక ప్రకారమే తెలంగాణ ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. మూడేళ్ళ క్రితం వరకు తెలంగాణా రైతు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో కూరుకుపోయి గంటకో రైతు అప్పులబాధ తాళలేక ఆత్మహత్యలకు పాల్పడటాన్ని గుర్తు చేస్తున్నారు. సొంత రాష్ట్ర ఏర్పాటు అనంతరం తొలి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన వెంటనే కేసీఆర్ రైతు రుణమాఫీకి ఉపక్రమించారు. ఇలా రైతుల్ని రుణవిముక్తుల్ని చేయడం మొదలెట్టారు. ఏటా నిర్ణీత మొత్తంలో విడుదల చేశారు. తాజాగా మంజూరు చేసిన నాలుగువేల కోట్లతో పూర్తిస్థాయిలో రైతు రుణవిముక్తి చేసిన తొలి ప్రభుత్వంగా ఘనుతకెక్కారు. వరుసగా నాలుగేళ్ళ బడ్జెట్ లో నాలుగువేలకోట్ల చొప్పున రుణ విముక్తికి కేటాయించిన కేసీఆర్ వచ్చే ఏడాది నుంచి ఇక విముక్తికి నిధులు కేటాయించాల్సిన అవసరం లేకపోవడంతో ఇదే మొత్తంతో మరోరూపంలో రైతుకు ప్రయోజనం చేకూర్చాలని నిర్ణయించారని వారు విశ్లేషిస్తున్నారు.
తాజా నిర్ణయంతో రైతులకు విశేషమైన మేలు జరుగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే రైతులకు అవసరమైన స్థాయిలో ఉచిత విద్యుత్ సరఫరా అవుతోంది. నిరంతర 9గంటల సరఫరాతో పాటు గోదావరి జలాల్ని సాగుకు మళ్ళించడంలో కేసీఆర్ ప్రభుత్వం విజయం సాధించింది. అటు నీరు ఇటు విద్యుత్ వీటితో పాటు ఉచిత ఎరువులు, దుక్కిమందులు దీంతో తెలంగాణా రైతుకు ఉత్పాధక వ్యయం అనూహ్యంగా తగ్గుతుంది. ప్రతి పంటకు ఎకరానికి 10నుంచి 15వేల వరకు రుణం చేయక తప్పని పరిస్థితి ఇంతవరకు నెలకొంది. ఇందులో ఐదారువేలు ఎరువులు, దుక్కిమందుకు ఖర్చవుతుంటే వెయ్యి రూపాయల వరకు పురుగుల మందుల కోసం వ్యయం చేయాల్సి వస్తోంది. 3నుంచి 4వేల రూపాయలు విద్యుత్ బిల్లుల రూపంలో చెల్లించాల్సొచ్చేది. ఇదికాక కూలీల వేతనంగా మరో మూడువేలు భరించాల్చి వచ్చేది. తీరాచూస్తే ఉత్పాదక వ్యయానికి-విక్రయ ధరకు మధ్య పెద్దగా వ్యత్యాసముండేదికాదు. దీంతో వడ్డీతో సహా రుణాన్ని తిరిగి చెల్లించడంలో రైతు విఫల మయ్యేవాడు. ఇదేసగటు రైతును అప్పుల ఊబిలోకి నెట్టేసి ఆత్మహత్యల దిశగా పురిగోల్పేది. అయితే కేసీఆర్ తాజా నిర్ణయంతో విద్యుత్ కు బిల్లుల్లేవు. ఎరువులు, దుక్కిమందుకు చెల్లించ నక్కర్లేదు. విత్తనాలు కూడా సగం సబ్సిడీపై ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఇక పురుగుల మందు ఒకటే కొనుగోలు చేస్తే చాలు. ఎక్కువమంది రైతులకు ఆ అవసరం కూడాలేదు. దేశంలోనే ఇది తొలి ప్రయోగమని అంటున్నారు. సాగు ఉత్పాధక వ్యయం తగ్గించడమే కాదు.. రాష్ట్రాన్ని సాగుకు కేంద్రంగా తీర్చిదిద్దాలన్నది కూడా వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు దోహదపడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/