Begin typing your search above and press return to search.

తమిళనాట బీజేపీ పెద్దలంటే ఎంత భయమో బయటపడింది?

By:  Tupaki Desk   |   24 March 2021 2:30 AM GMT
తమిళనాట బీజేపీ పెద్దలంటే ఎంత భయమో బయటపడింది?
X
తమిళనాట బీజేపీ పెద్దలంటే ఎంత భయమో మరోసారి బయటపడింది. అధికార అన్నాడీఎంకే బీజేపీ పెద్దలకు ఎంతలా ఆరాధ్యులో తేటతెల్లమైంది. తాజాగా తమిళనాడు మాజీ సీఎంలు దివంగత జయలలిత, ఎంజీఆర్ ల స్మారకార్థం నిర్మించిన మందిరంలో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతల ఫొటోలు బయటపడ్డాయి. ఇది చూసి అన్నాడీఎంకే కార్యకర్తలంతా ముక్కున వేలేసుకుంటున్నారు. బీజేపీ పెద్దలపై అన్నాడీఎంకే పెద్దల ఆవాజ్య ప్రేమకు ఖిన్నులవుతున్నారు.

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అధికార అన్నాడీఎంకే బీజేపీ పొత్తు పెట్టుకొని కలిసి పోటీచేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ మందిరంలోకి వచ్చి చూసే వారిని ప్రభావితం చేసేందుకు బీజేపీ నేతల ఫొటోలను కూడా ఇందులో ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది.

తమిళనాడుకు అమ్మ జయలలిత చేసిన సేవలు, త్యాగానికి గుర్తుగా ఈ మందిరాన్ని అన్నాడీఎంకే సర్కార్ ఏర్పాటు చేసింది. అయితే ఒక ప్రాంతీయ పార్టీ అధినేత్రి మందిరంలో మోడీషాలు తమిళనాడుకు చేసిన అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని వారి ఫొటోలు పెట్టామని మంత్రులు తెలిపారు.

అయితే అంతా బాగానే ఉన్నా జయలలిత ఉన్నప్పుడు అసలు ఈ మోడీ షాలే కాదు.. ఏ జాతీయ పార్టీకి భయపడలేదు. తన ఎంపీ సీట్లతో కేంద్రంలోని పెద్దలనే తమిళనాడుకు రప్పించేవారు. ఇప్పుడు ఆమె పార్టీ పెద్దలు మాత్రం కేంద్రంలోని పెద్దలకు భయపడి ఏకంగా వారి ఫొటోలు పెట్టడంపై దుమారం చెలరేగుతోంది.