Begin typing your search above and press return to search.

మోడీ సైతం ఆయన ఉదారతకు థ్యాంక్స్ చెప్పాడు

By:  Tupaki Desk   |   21 April 2021 11:11 AM GMT
మోడీ సైతం ఆయన ఉదారతకు థ్యాంక్స్ చెప్పాడు
X
ఎప్పుడూ సంపాదించుకోవడం.. కోట్లకు కోట్లు పోగేసుకోవడం.. దేశంలోనే అపర కుబేరులుగా అవతరించడం ఆయనకు నచ్చదు. తనకు ఎన్ని పరిశ్రమలు ఉన్నా.. ఎంత సంపాదించినా ఆపద వేళ నేనున్నాంటూ ముందుకు వస్తుంటాడు 'టాటా'. దేశంలో నంబర్ 1 ధనవంతులుగా ఉన్న ముకేష్ అంబానీ, గౌతం అదానీలు కూడా రూపాయి ఖర్చు పెట్టడానికి ధైర్యం చేయలేకపోతున్న వేళ దిగ్గజ పారిశ్రామికవేత్త 'రతన్ టాటా' దేశంలోని కరోనా రోగుల కోసం ముందుకు రావడాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.

దేశంలో కరోనా కల్లోలం చోటుచేసుకుంది. లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. వ్యాక్సిన్ అందక ఇబ్బందులు పడుతున్నారు. రెమెడిసివిర్ డ్రగ్ దొరకడం లేదు. ఆక్సిజన్ అందక రోగులు చనిపోతున్నారు. దేశ ప్రజలు పడుతున్న కష్టాలు చూసి టాటా అధినేత రతన్ టాటా చలించిపోయారు.

దేశం ఎప్పుడు కష్టాలు ఎదుర్కొంటుందో అదే క్షణంలో కష్టాలకు ఎదురెళ్లి దేశాన్ని కాపాడడంలో 'టాటా' దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఎప్పుడూ ముందుంటారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా వారు సంపాదనలోనే కాదు.. సేవలోనూ ముందున్నారు.

తాజాగా ఆక్సిజన్ అందక రోగులు చనిపోతున్నారని తెలిసి రోజుకు 300 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ను తన కంపెనీల ద్వారా వివిధ రాష్ట్రాలకు ఉచితంగా పంపిణీ చేయడానికి టాటా స్టీల్ కంపెనీ ముందుకొచ్చింది. ఈ మేరకు రతన్ టాటా ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.

ఈ మేరకు ఉచితంగా ఆక్సిజన్ సరఫరా చేస్తామని.. కోవిడ్ మీద చేసే యుద్ధంలో మనం గెలుస్తాం అని ప్రధాని మోడీకి రతన్ టాటా సందేశం పంపారు. దీనికి మోడీ కూడా స్పందించారు. రతన్ టాటా చేసిన సాయానికి ప్రధాని మోడీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇక మోడీకి సన్నిహితులైన అంబానీ, అదానీల స్పందన ఏంటంటూ దీన్ని బేస్ చేసుకొని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. అదే సమయంలో రతన్ టాటా చేసిన సేవాతప్త హృదయానికి దేశం ప్రణమిల్లుతోందని ఆనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.