Begin typing your search above and press return to search.
మోడీకి వ్యతిరేకంగా ఏకమైన పార్లమెంట్
By: Tupaki Desk | 14 Aug 2016 5:34 AM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పార్లమెంటులోని ఎంపీలంతా ఏకమయ్యారని అంటున్నారు. ఇందులో బీజేపీ సభ్యులు సైతం ఉన్నారని వారు చెప్తున్నారు. పార్లమెంటు సభ్యుల వేతనాన్ని యాభై వేల నుండి లక్ష రూపాయలకు పెంచటంతోపాటు అన్ని అలవెన్సులు కలిపి మొత్తం వేతనాన్ని రెండు లక్షల ఎనభై వేలకు పెంచాలనే ప్రతిపాదనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో పార్టీలకు అతీతంగా పార్లమెంటు సభ్యులు ప్రధాని తీరును తప్పుపట్టారని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
బీజీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని పార్లమెంటరీ కమిటీ ఎంపీల వేతనాలను పెంచాలని సిఫారసు చేసింది. ఆదిత్యనాథ్ తోపాటు అన్ని పార్టీలకు చెందిన పదిమంది ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీని కలిసి వేతనాలు పెంచటం గురించి వివరించారు. ప్రధాని వారు చెప్పినదంతా సావకాశంగా విన్న తరువాత ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీల వేతనాలు పెంచటం మంచిదికాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. లోక్ సభ - రాజ్యసభ సభ్యులకు ప్రస్తుతం ప్రతి నెలా యాభై వేల రూపాయల వేతనంతోపాటు నలభై ఐదు వేల రూపాయల నియోజకవర్గం అలవెన్సు ఇస్తున్నారు. వేతనాన్ని లక్ష రూపాయలకు - అలవెన్సును తొంబై వేలకు పెంచాలని కమిటీ సిఫారసు చేసింది. ఈ రెండింటితోపాటు ఇతర అలవెన్సులను తొంబైవేలు చేయాలని యోగి ఆదిత్యనాథ్ ప్రతిపాదించారు. పార్లమెంటు సభ్యుల వేతనాలను 2010లో పెంచారు. అప్పుడు వేతనం పదహారు వేలనుండి యాభైవేలకు పెంచారు. పార్లమెంటుకు హాజరైనందుకు చెల్లించే అలవెన్సును వెయ్యి నుంచి రెండు వేలకు పెంచారు. నియోజకవర్గం అలవెన్సును ఇరవై వేల నుండి నలభై ఐదు వేలు చేశారు. మాజీ ఎంపీల పెన్షన్ ను ఎనిమిది వేలనుండి ఇరవైవేలకు పెంచారు.
గత ఆరేళ్లలో పరిస్థితులు బాగా మారినందున ఎంపీల వేతనాలను బాగా పెంచాలన్నది యోగి ఆదిత్యనాథ్ ప్రతిపాదన. ఎంపీలకు గౌరవప్రదమైన వేతనాలు చెల్లించకుండా వారినుండి నిజాయితీని ఆశించలేమని పలువురు వాదిస్తున్నారు. శాసనసభ్యుల వేతనాలు బాగా పెరిగాయని - అధికారులు-ప్రభుత్వ సిబ్బంది వేతనాలు సైతం పెరిగాయి - ఆయా శాఖల కార్యదర్శులు - ఇతర సీనియర్ అధికారుల వేతనాలు రెండు నుండి రెండున్నన లక్షలకు చేరినప్పుడు ప్రజాప్రతినిధులకు గౌరవ ప్రదమైన వేతనం చెల్లించకపోతే ఎలా అని వారు అడుగుతున్నారు. బీజేపీ నాయకత్వంలోని ఎన్ డిఏతోపాటు కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఏ మిత్రపక్షాలు - ఇతర అన్ని పార్టీల నాయకులు - సభ్యులు కూడా వేతన పెంపుదల ప్రతిపాదనను సమర్థిస్తున్నారు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ - ఆయన సలహాదారులు మాత్రం వీరి వాదనతో ఏకీభించటం లేదు. ఎంపీల వేతనాన్ని నూటికి నూరు శాతం పెంచటం అసాధ్యమని వాదిస్తున్నారు. రాజకీయ నాయకులు - ఎంపీలపట్ల ప్రజల్లో సదభిప్రాయం లేదని ఈ నేపథ్యంలో వారి వేతనాలను పెంచితే ప్రజల ఆగ్రహాన్ని ఎదుర్కోవలసి వస్తుందని పిఎంవో వర్గాలు వాదిస్తున్నట్లు తెలిసింది.పార్లమెంటు సభ్యుల వేతనాలు - అలవెన్సులను పెంచేందుకు సంబంధించిన బిల్లు వర్షాకాల సమావేశాల్లో ప్రతిపాదించి ఆమోదించాలనుకున్నారు - అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిరస్కరించటంతో ఇది ఆగిపోయింది.
కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ దీనిపై స్పందిస్తూ వేతనాలు పెంచాలని ఎంపీలు డిమాండ్ చేశారు. ఏడవ వేతన సవరణ సంఘం సిఫార్సులకు అనుగుణంగా ఎంపీల సెక్రటరీల వేతనాలు తమ కంటే అధికంగా పెరుగుతున్నాయని వారు అన్నారు. ఎంపీల వేతనాలు పెంచాలని పార్లమెంటరీ కమిటీ నివేదిక ఇచ్చినా ప్రధాని ఎలాంటి చర్య తీసుకోలేదని అన్నారు. ఆయన విదేశీ పర్యటనలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అన్నారు.