Begin typing your search above and press return to search.

మోడీ జీ ఇదేంది : బ్యాంక్ చెక్కుల మీద 18 శాతం జీఎస్టీ విధింపు

By:  Tupaki Desk   |   20 July 2022 2:53 PM GMT
మోడీ జీ ఇదేంది : బ్యాంక్ చెక్కుల మీద 18 శాతం జీఎస్టీ విధింపు
X
జీఎస్టీ ఒకనాడు అందమైన పదంగా మొదలెట్టి ఇపుడు పెను భారంగా మార్చేశారు. అయిదేళ్ల క్రితం జీఎస్టీ గురించి ఎంత గొప్పగా చెప్పరంటే దేశంలో అందిరికీ అన్నీ ఒకే రేటుకు వస్తాయని. ఒకే దేశం, ఒకే ధర అంటూ తెగ ఊదరగొట్టారు. జీఎస్టీ వల్ల చాలా ధరలు నేలకు దిగివస్తాయని కూడా చెప్పుకొచ్చారు.

కానీ ఇపుడు జీఎస్టీని ఆసరాగా చేసుకుని ధరలు అన్నీ పెంచేస్తున్నారు. కాదేదీ అనర్హం అన్న తీరున ప్రతీ దాని మీద జీఎస్టీ విధిస్తున్నారు. అది అంతకంతకు పెంచుకుపోతున్నారు. మొత్తానికి చూస్తే జీఎస్టీ ఈ రోజు సామాన్యుడి నెత్తిన భారంగా మారింది అనే చెప్పాలి.

అఖరుకు పాలు, పెరుగు మీద కూడా జీఎస్టీ విధించే స్థాయికి కధ నడిపించేశారు. ఇపుడు చూస్తే బ్యాంక్ చెక్కుల మీద 18 శాతం జీఎస్టీ విధింపుతో సామాన్యుడి నడ్డి విరగగొట్టారు. దీని మీద ప్రొఫెసర్ నాగేశ్వర్ అయితే తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

ఇదేమిటి మోడీజీ అంటూ జీఎస్టీ మరీ హాస్యాస్పదంగా మార్చేశారా అని కూడా విమర్శించారు. బ్యాంక్ చెక్కుల మీద 18 శాతం జీఎస్టీ విధించడం దారుణమని అన్నారు. చెక్కుల జారీ మీద బ్యాంకులు వసూల్ చేసే రుసుము మీద కూడా జీఎస్టె విధించడం బాధాకరమని ఆయన తప్పుపట్టారు.

సామాన్య ప్రజలకు తాము దాచుకున్న సొంత సొమ్ముని పొదుపు మొత్తాలను విత్ డ్రా చేసుకోవడానికి కూడా 18 శాతం జీఎస్టీ చెల్లింపు అంటే నిజంగా హాస్యాసపదమే మోడీజీ అని ప్రొఫెసర్ నాగేశ్వర్ ట్వీట్ చేశారు.

నిజంగా ఇది కామెడీగా కనిపిస్తున్నా మంట పుట్టించేలా జీఎస్టీ వడ్డింపు ఉందని చెప్పాలి. దీని మీద జనాలు ఏమనుకున్నా సొమ్ము రాల్సిందే అని కేంద్రం కొరడా పుచ్చుకుని అదిలిస్తే మాత్రం జనం ఆగ్రహం చవి చూడాల్సి ఉంటుందని అంటున్నారు.