Begin typing your search above and press return to search.
నిద్ర పోయే ముందు కూడా మొబైల్ ఫోన్లతోనే.. హైదరాబాదీయుల్లో పెరిగిన దురలవాటు
By: Tupaki Desk | 16 April 2021 9:30 AM GMTలేచింది మొదలు పడుకునే వరకు చేతిలో సెల్ ఫోన్ ఉండాల్సిందే. దీని కారణంగా.. ఎంతో మందిని నిద్రకు దూరం చేస్తున్న దుస్థితి. అయినా పట్టించుకోకుండా.. స్క్రీన్ మీద కనిపించే వాటిలో ఎంగేజ్ అయిపోయే దరిద్రపు లక్షణ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఈ అలవాటు ఎంత ఎక్కువగా ఉందన్న విషయాన్ని తాజాగా ఒక అధ్యయనం కళ్లకు కట్టినట్లుగా వెల్లడించింది. వేక్ ఫిట్. కో అనే సంస్థ గ్రేట్ ఇండియన్ స్లీప్ స్కోర్ కార్డు హైదరాబాదీయుల నిద్ర అలవాట్ల గురించి ఆసక్తికర అంశాల్ని వెల్లడించింది.
అధ్యయనంలో ఏం పేర్కొన్నారంటే..
- హైదరాబాదీయులు పడుకునే ముందు వరకు మొబైల్ తోనే గడుపుతారు. అలాంటి అలవాటు 94 శాతం మందికి ఉంది.
- గత ఏడాది ఈ అలవాటు 91 శాతం మందికి ఇప్పుడు ఏడాదిలో మూడు శాతం పెరిగింది.
- మొబైల్ పుణ్యమా అని 80 శాతం మంది వారానికి ఒకట్రెండు రోజులు నిద్ర మబ్బుతోనే పని చేస్తున్నారు
- 26 శాతం మంది అర్థరాత్రి వరకు స్మార్ట్ ఫోన్.. లాప్ టాప్ లలో సినిమాలు చేసినట్లు చెబుతున్నారు
- 16 శాతం మంది స్మార్ట్ ఫోన్.. లాప్ టాప్ లతోనే బెడ్ పైన ఉండి పని చేస్తున్నారు
- 40 శాతం మంది వెన్ను సమస్యలతో బాధ పడుతున్నారు
- 90 శాతం మంది కంటే ఎక్కువ రాత్రి వేళలో ఒకట్రెండు సార్లు మేల్కొంటున్నారు.
- ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో ఆరోగ్యకరమైన నిద్ర అలవాట్లపై అవగాహన ఎక్కువ. అయితే.. ఇటీవల కాలంలో నాణ్యమైన నిద్రకు హైదరాబాదీయులు దూరమవుతున్నారు.