Begin typing your search above and press return to search.

మొబైల్ పాస్ వర్డ్స్ మారిపోనున్నాయ్

By:  Tupaki Desk   |   12 March 2016 10:30 PM GMT
మొబైల్ పాస్ వర్డ్స్ మారిపోనున్నాయ్
X
అత్యాధునిక సాంకేతిక అందుబాటులోకి వస్తున్నకొద్దీ.. అప్పటివరకూ అందుబాటులో ఉన్నవి మారిపోతున్న పరిస్థితి. ఒకప్పటి వాక్ మెన్లు ఇప్పటి తరానికి చెప్పినా అర్థం కావేమో. అక్కడిదాకా ఎందుకు.. మొబైల్ ఫోన్ల విషయానికే వస్తే.. ఇవాల్టి స్మార్ట్ ఫోన్లకు తొలినాళ్లలో ఉన్న మొబైళ్ల గురించి ఇప్పటి తరానికి చెబితే నవ్వటం ఖాయం.

రోజురోజుకీ వస్తున్న మార్పులతో పరిస్థితులు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితే మొబైళ్లలో ఎదురుకానుంది. స్మార్ట్ ఫోన్లలో అత్యంత కీలకమైన పాస్ వర్డ్స్ కు సంబంధించి కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇప్పటివరకూ ఉన్న ప్యాట్రన్ తీరుకు భిన్నమైనవి అందుబాటులోకి రానున్నాయి. ఇప్పుడు అందుబాటులో ఉన్న ప్యాట్రన్లు అన్నీ కూడా ముందే సిద్దం చేసినవి. వీటికి ఉండే ఆప్షన్లు చాలా పరిమితం.

కానీ.. సరికొత్త టెక్నాలజీలో ఇప్పుడు ఉన్న వాటికి భిన్నమైన పాస్ వర్డ్స్ అందుబాటులోకి రానున్నాయి. తాజా సాంకేతికతో డూడుల్స్ తో నచ్చిన పాస్ వర్డ్ ను ఎవరికి వారు రూపొందించుకునే వీలు ఉండనుంది. దీంతో.. ఫోన్ ఆన్ లాక్ తీరు తెన్నులు మొత్తంగా మారిపోనున్నాయి. అందుబాటులో ఉన్న వాటిలో ఒకటి కాకుండా.. ఎవరికి వారు తమకు నచ్చిన డూడుల్ ను వేళ్లతో గీసుకోటం.. వాటినే పాస్ వర్డ్ గా మార్చుకునే సదుపాయం త్వరలో అందుబాటులోకి రానుంది.ఇలాంటి మార్పులు రానున్న రోజుల్లో ఇంకెన్ని రానున్నాయో..?