Begin typing your search above and press return to search.
బీజేపీ ముఖ్యమంత్రి సభకు నిప్పు.. ఎక్కడ? ఎందుకు?
By: Tupaki Desk | 28 April 2023 3:00 PM GMTఆయన బీజేపీ పాలిత రాష్ట్రంలో ముఖ్యమంత్రి. అయితే.. ఆయన తీసుకున్న వివాదాస్పద నిర్ణయం కారణంగా.. తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి పాల్గొననున్న సభను సభా వేదికను నిరసన కారులు తగల బెట్టారు. సీఎం సభా వేదికను దహనం చేయడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
మణిపూర్ సీఎం, బీజేపీ నాయకుడు బీరేన్ సింగ్ చురాచాంద్ పుర్ లో పర్యటించాల్సి ఉంది. అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభం చేసి.. ప్రజలను ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉంది. అయితే.. అనూహ్యంగా ఆయన పాల్గొనే సభను, సభావేదికను కూడా గురువారం రాత్రి కొందరు నిరసన కారులు నిప్పు పెట్టి తగల బెట్టారు. దీంతో ప్రభుత్వం అప్రకటిత కర్ఫ్యూ విధించింది. రాష్ట్రంలో భారీగా జనాలు గుమిగూడటం, ఇంటర్నెట్ సేవలపై నిషేధం విధించారు.
ఆ నిర్ణయమే ఆగ్రహానికి కారణం?
బీజేపీ నేతృత్వంలోని మణిపూర్ ప్రభుత్వం చిత్తడి నేలలతో పాటు రిజర్వ్, రక్షిత అటవీ ప్రాంతాలను సర్వే చేయడం ప్రారంభించింది. అయితే.. ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆదివాసీ గిరిజన నాయకుల వేదిక కొన్నాళ్లుగా ఆందోళనలు చేపట్టింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రార్థనా స్థలాలను కూల్చివేస్తాం దని గిరిజన నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే.. ప్రభుత్వం వీరి ఆందోళనలను అణిచి వేస్తోంది. అవసరమైతే.. కేంద్ర బలగాలను కూడా రప్పిస్తామని.. ఇటీవలే సీఎం బీరేన్ సింగ్ హెచ్చరించారు.
దీంతో ఆగ్రహోదగ్రులైన ఆదివాసీలు.. సమయం కోసం వేచి చూశారు. తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ చురాచాంద్ పుర్ జిల్లాలో కొత్తగా నిర్మించిన జిమ్, క్రీడా వసతి కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు సభావేదిక ఏర్పాటు చేశారు.
గురువారం ఈ గిరిజన నేతలు నూతన క్రీడా వసతిలోని కుర్చీలు, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. క్రీడా పరికరాలకు నిప్పంటించారు. దాంతో సీఎం కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన వేదిక కూడా దహనమైంది. మొత్తానికి బీజేపీ పాలిత రాష్ట్రంలో సీఎంకు ఎదురు దెబ్బ తగలడం.. గమనార్హం. మణిపూర్‌లో గత ఏడాది నవంబరులో ఎన్నికలు జరిగాయి.