Begin typing your search above and press return to search.

48 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్లిపోండి

By:  Tupaki Desk   |   23 Sept 2016 3:07 PM IST
48 గంటల్లో దేశం విడిచిపెట్టి వెళ్లిపోండి
X
బాలీవుడ్ లో పాకిస్థాన్ కు చెందిన నటులు, ఇతర రంగాలవారు ఉన్న విషయం తెలిసిందే. అయితే.. యూరీలో ఉగ్రదాడి నేపథ్యంలో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తడంతో మన దేశంలోని ఆవేపూరిత రాజకీయ పార్టీ నవనిర్మాణ సేన పాకిస్థానీలపై మండిపడుతోంది. పాకిస్థాన్ నటీనటులు- ఆర్టిస్టులకు అల్టిమేటం జారీ చేసింది. బాలీవుడ్ లో ఉన్న పాకిస్థాన్ నటీనటులంతా 48 గంటల్లో ఇండియా వదిలిపెట్టి వెళ్లి పోవాలని ఎమ్మెన్నెస్ కు చెందిన చిత్రపట్ కర్మచారి సేన హెచ్చరించించింది. భారతదేశంలో నివసిస్తున్న పాకిస్థాన్ ఆర్టిస్టులు మూటముళ్లె సర్దుకుని వెళ్లిపోవాలని చిత్రపట్ సేన అమేయ్ ఖోపాక్ హెచ్చరించారు.

''పాకిస్థాన్ నటులు - ఆర్టిస్టులు మనదేశం విడిచిపెట్టి వెళ్లిపోవడానికి 48 గంటలు సమయం ఇస్తున్నాం. ఒకవేళ వారు వెళ్లకపోతే ఎమ్మెన్నెస్ బయటకు గెంటేస్తుంది" అని అమేయ్ పేర్కొన్నారు.

కాగా పాకిస్థాన్ కళాకారులకు వ్యతిరేకంగా శివసేన - ఎమ్మెన్నెస్ గతంలో పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్ కు చెందిన గజల్ గాయకుడు గులామ్ అలీ ఇటీవల ముంబైలో జరగాల్సిన తన ప్రదర్శనను రద్దు చేసుకున్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం తీరు కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని ఆ దేశ కళాకారులు ఆవేదన చెందుతున్నారు. నిజానికి పాకిస్థాన్ లో ప్రఖ్యాత కళాకారులకు ఇండియాలో మంచి మార్కెట్ ఉంది. కానీ... ఇలాంటి సందర్భాల్లో వారికి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.