Begin typing your search above and press return to search.

ఏపీ: బీజేపీ అధ్యక్షుడు మారిపోయారు

By:  Tupaki Desk   |   27 July 2020 5:30 PM GMT
ఏపీ: బీజేపీ అధ్యక్షుడు మారిపోయారు
X
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ లో సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధ్యక్షుడిని మారుస్తూ ఆదేశాలు వెలువరించింది. రెండేళ్ల పాటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ స్థానంలో సోము వీర్రాజుకు నియమించారు. అయితే, పాత కొత్త అధ్యక్షులు ఇద్దరిదీ ఒకటే సామాజిక వర్గం కావడం గమనార్హం.

ఏపీలో బీజేపీ మరింత దూకుడుగా మందుడుగు వేయాలనుకుంటున్న క్రమంలో ఒక ఫైర్ బ్రాండ్ గా పేరుపడిన సోము వీర్రాజుకు పార్టీ పగ్గాలు అప్పగించడం గమనార్హం. సోమును నియమిస్తూ ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేసీ నడ్డా పత్రికా ప్రకటన విడుదల చేశారు. తూర్పు గోదావరి జిల్లా కత్తేరు గ్రామానికి చెందిన సోము వీర్రాజు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. తాజా పదవితో ఆయనకు బీజేపీ ప్రమోషన్ ఇచ్చినట్లయ్యింది. ప్రస్తుత అధ్యక్షుడు కన్నాకు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయిన విషయం తెలిసిందే.

అయితే, కాపు సామాజిక వర్గం మద్దతు పలికిన జనసేనతో జతకట్టిన బీజేపీ పార్టీ అధ్యక్షుడిని కూడా అదే సామాజిక వర్గం నుంచి ఎంచుకోవడం చూస్తుంటే... ఏపీలో ప్రధాన సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు.