Begin typing your search above and press return to search.
వైసీపీ కండువా కప్పుకొన్న మరో టీడీపీ ఎమ్మెల్సీ ..ఎవరంటే ?
By: Tupaki Desk | 18 March 2020 5:06 PM ISTస్థానిక సంస్థల ఎన్నికల వేళ టీడీపీకి దెబ్బ దెబ్బ మీద పడుతూనే ఉంది. టీడీపీలోని కీలక నేతలందరూ ఒక్కొక్కరుగా వరుస పెట్టి సైకిల్ దిగి ఫ్యాన్ గూటికి చేరుతున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ ఎమ్మెల్సీ శమంతకమణి - ఆమె కూతురు మాజీ ఎమ్మెల్యే యామినీబాల బుధవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. వీరిని సాదరంగా పార్టీలోకి వైఎస్ జగన్ ఆహ్వానించారు. అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో గట్టి పట్టున్న వీరిద్దరూ తమ అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు.
కాగా, టీడీపీలో శమంతకమణి సీనియర్ నేతగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి ఓసారి శింగనమల ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత టీడీపీలో చేరి కీలక నేతగా ఎదిగారు. 2019లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి - జిల్లా నేతల సలహాతో శింగనమల నియోజకవర్గ అభ్యర్థిని చంద్రబాబు మార్చేశారు. అప్పటిదాకా ఎమ్మెల్యేగా ఉన్న యామిని బాలకు బదులు కొత్తగా వచ్చిన బండారు శ్రావణికి శింగనమలలో అవకాశం కల్పించారు. తన కుమార్తె కు టికెట్ కోసం చివరి వరకు శమంతకమణి ప్రయత్నాలు చేశారు. ఆ సమయంలో చంద్రబాబును కలిసి మాట్లాడిన కూడా యామినికి టికెట్ ఇవ్వలేదు. పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినా కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇచ్చి పార్టీనే నమ్ముకున్న వారిని దూరం చేశారంటూ అప్పట్లో బహిరంగంగానే ఆమె చంద్రబాబుని విమర్శించింది.