Begin typing your search above and press return to search.

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరిగేది ఎలా?

By:  Tupaki Desk   |   30 Dec 2015 4:09 AM GMT
ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు జరిగేది ఎలా?
X
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు జరగనుంది. మిగిలిన ఓట్ల లెక్కింపునకు.. తాజాగా ఓట్ల లెక్కింపు మధ్య వ్యత్యాసం ఉండనుంది. ప్రాధాన్యత ఓట్ల ప్రకారం ఈ ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో.. ఓట్ల లెక్కింపు వ్యవహారం కాసింత ఆసక్తికరంగా ఉంటుంది. తాజా ఓట్లు లెక్కింపు ఎలా జరుగుతుందంటే..?

1. నేరుగా ఓటేసే విధానంలో కాకుండా.. ప్రాధాన్యత ఓటింగ్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో ఫలితాల్ని తొలిగింపు విధానంలో లెక్కిస్తారు. అంటే.. నోటాతో పాటు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.

2. బ్యాలెట్ పేపరుపై క్రమానుగతంగా వేసిన ఓట్లు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

3. నోటాకు ప్రథమ ప్రాధాన్యత ఓట్లు.. చెల్లని ఓట్లను లెక్కింపులో మినహాయిస్తారు.

4. ఈ మినహాయింపుల అనంతరం అభ్యర్థులకు వచ్చే ప్రాధాన్యత ఓట్లను గుర్తిస్తారు.

5. ఒక అభ్యర్థినే విజేతగా నిలిపే నల్గొండ.. ఖమ్మం జిల్లాల్లో మొత్తం చెల్లిన ఓట్లలో ఏ అభ్యర్థికి సగాని కంటే ఒక ఓటు అదనంగా వస్తే అతడే విజేత.

6. ఒకవేళ ఈ పద్ధతిలోఅభ్యర్థి ఎంపిక పూర్తికాకుంటే..రెండో ప్రాధాన్యత పద్ధతిలో లెక్కిస్తారు. అందులో వచ్చిన ఓట్ల పాయింట్ల ఆధారంగా విజేతను ఎంపిక చేస్తారు.