Begin typing your search above and press return to search.
ఎమ్మెల్సీ ఎన్నికలు... జగన్ ధీమాకు అసలు కారణం ఇదా...!
By: Tupaki Desk | 12 March 2023 4:00 PM GMTఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ దుమ్మురేపడం ఖాయమా? అంటే.. ఔననే అంటున్నారు వైసీపీ నాయకులు. అంతేకాదు.. పైకి జరుగుతున్న ప్రచారం అంతా కూడా బూటకమేనని చెబుతున్నారు. ఉద్యోగులు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని.. ఉపాధ్యాయులు అసలుఓటే వేయరని..జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీనికి కారణం.. వైసీపీ పరంగా.. వారికి అన్నీ అందుతున్నాయని చెబుతున్నారు. ఒక్క సీపీఎస్ రద్దు విషయంలో మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోందని అంటున్నారు.
అదేసమయంలో పీఆర్సీ.. సహా .. ఇతర బకాయిల విషయంలో సర్కారు ఉద్యోగులకు అన్నీ చేస్తోందని వైసీపీ నేతలు వెల్లడిస్తున్నారు. పొరుగున ఉన్న తెలంగాణలోనూ సమయానికి వేతనాలు రావడం లేదని.. ఈ విషయాన్ని మంత్రులే చెబుతున్నారని.. అయినా.. ఏపీలో మరీ అంత దారుణ పరిస్థితి ఏమీ లేదని చెబుతున్నారు. ఇక, ఒక్క తెలంగాణలోనే కాదు.. తమిళనాడు, ఒడిసా వంటి రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్తితి నెలకొందని.. ఈ విషయం ఉద్యోగులకు కూడా తెలుసునని అంటున్నారు.
ఇక, సీపీఎస్ విషయం కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్టుగానే ఏపీలోనూ ఉందని చెబుతున్నారు. రాజస్తాన్.. చత్తీస్‌గఢ్ వంటి రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దు చేసినా.. దీని విషయంలో ప్రభుత్వాలు వెనక్కుతగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోందని చెబుతున్నారు. పైగా సీపీఎస్ రద్దు చేస్తామని ఆయా రాష్ట్ర ప్రబుత్వాలు ప్రకటించినా..ఇప్పటి వరకు సంబంధిత ఉత్తర్వులు ఇవ్వని విషయాన్ని కూడా వైసీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు.
ఇలా మొత్తంగా చూసుకుంటే.. ఉద్యోగులకు ఫ్రెండ్లీ సర్కారుగా వైసీపీనే నిలుస్తోందని అంటున్నారు. ఈ విషయం ఉద్యోగులకు కూడా తెలుసునని.. అందుకే వారంతా తమ వెంటే ఉంటారని..చెబుతున్నారు. పైగా వలంటీర్ వ్యవస్థను తీసుకురావడంద్వారా ఉద్యోగులపై ఒత్తిడి తగ్గించిన విషయాన్ని కూడా వారు చెబుతున్నారు. మొత్తంగా.. ఉద్యోగులకు ఫ్రెండ్లీ సర్కార్ వైసీపీనేనని.. కాబట్టిఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు గుండుగుత్తగా తమకే ఓటు వేస్తారని అంటున్నారు పరిశీలకులు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.