Begin typing your search above and press return to search.
ఎమ్మెల్సీ ఎన్నికలు : ప్రజాస్వామ్యం అపహాస్యమేనా...?
By: Tupaki Desk | 13 March 2023 10:22 PM GMTప్రజాస్వామ్యంలో ప్రతీ పౌరుడూ స్వేచ్చా ఓటు వేసే అవకాశం ఉంటుంది. ఓటు అంటే అభిమతం తెలియచేయడం. ఇదంతా స్మూత్ గా జరగాలి. మరో వైపు చూస్తే ఎవరు ఓట్లు వేయాలి. ఎవరు అర్హులు అన్నది కూడా చూడాలి. కానీ ఏపీలో ఎమెంల్సీ ఎన్నికలు అపహాస్యం పాలు అయ్యాయని విపక్షాలు అయితే ముక్తకంఠంతో అంటున్నాయి.
ఏపీలో తొమ్మిది జిల్లాలలో జరిగిన తొమ్మిది ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంతటా ప్రలోభాలు భోగస్ ఓట్లు విచ్చలవిడిగా అధికార దుర్వినియోగం వంటివి చోటు చేసుకున్నాయని అంటున్నారు. దీని మీద టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ సైతం రాశారు. అలాగే రాష్ట్రంలోని యంత్రాంగానికి తెలుగుదేశం నాయకులు పలుమార్లు విన్నపాలు చేశారు.
ఏమి చేసినా పెద్దగా స్పందన అయితే రాలేదు అంటున్నారు. దాంతో యధేచ్చగా అధికార పార్టీ వైసీపీ తోచిన తీరున పెద్దల సభకు వెళ్లే పెద్ద మనుషుల ఎన్నికలు జరిగిపోయాయని విపక్షాలు అంటున్నాయి. పోలింగ్ రోజు వరకూ ప్రలోభాలతో అధికార పార్టీ ప్రయత్నం చేసింది అని తెలుగుదేశం ఆరోపిస్తోంది. అదే విధంగా పట్టభద్రుల ఎన్నికల విషయంలో అయిదవ తరగతి కూడా చదవని వారు గ్రాడ్యుయేట్లు అవతారం ఎత్తి ఓట్లేశారు అని ఆరోపిస్తోంది.
ఇలా భోగస్ ఓట్లు హెచ్చుగా ఉన్నాయని వీటి మీద ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఫలితంగా ఎమ్మెల్సీ ఎన్నికలు ఒక ప్రహసనంగా సాగిపోయాయని అంటున్నారు. ఇతర ప్రాంతాల వారిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు అనుమతించడం కూడా విపక్షాలు తప్పు పడుతున్నాయి. అక్రమంగా బస్సులలో వస్తున్న వారిని లైవ్ వీడియో తీసి చూపించినా అధికారులు పట్టనట్లుగా వ్యవహరించారు అన్న విమర్శలను విపక్షాలు చేస్తున్నాయి.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు పనిగట్టుకుని మరీ కడప, తిరుపతి, జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడినా ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు లేవు అని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఉప ఎన్నికల్లో ఇలాంటి సంఘటననే వైసీపీ ఏలుబడిలో జరిగాయని ఇపుడు అవే సన్నివేశాలు జరిగినా అధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు.
దీని మీద తెలుగుదేశం అధికార ప్రతినిధి జీవీ రెడ్డి ఒక టీవీ చానల్ డిబేట్ లో మాట్లాడుతూ ఎన్నికలను సవ్యంగా జరగనీయకుండా అధికార వైసీపీ పూర్తిగా అపహాస్యం చేస్తోందని నిందించారు. ప్రజాస్వామ్యాన్ని వ్యవస్థలను తమ దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం ఇదని ఆయన ఆక్షేపిస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఇలాంటివి చేయడం తగని పని అని అన్నారు. అయినా ఇలా జరుగుతూనే ఉన్నాయని ఈసీ దీని మీద పెద్దగా దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మొత్తానికి చూస్తే ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీ అక్రమాల మీద విపక్షాలు అన్నీ ఒకే తీరున మాట్లాడుతున్నాయి. ఈ నెల 16న ఫలితాలు రానున్నాయి. అధికార విపక్షాల బలబలాలు ఏంటో అవి పూర్తిగా చెబుతాయా లేక ముందే విపక్షాలు ఆరోపించినట్లుగా ఎన్నికలు సజావుగా సాగలేదని ప్రతిపక్షాలు అంటాయా అన్నది చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.