Begin typing your search above and press return to search.
గులాబీ బ్యాచ్ కు ఎమ్మెల్సీ తిప్పలు మామూలుగా లేవుగా?
By: Tupaki Desk | 26 Feb 2021 8:30 AM GMTఇవాల్టి టీఆర్ఎస్ అధికార పత్రిక నమస్తే తెలంగాణ చూశారా? ఎందుకు చూడాలన్న ప్రశ్న రావటంలో తప్పు లేదు. కాకుంటే.. ఒక ఎమ్మెల్సీ స్థానంలో పార్టీ గెలుపు కోసం అధికార పార్టీ పడుతున్న ప్రయాస ఎంతన్న విషయం కొట్టొచ్చినట్లుగా కనిపించే ఈ వైనం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెర తీసిందని చెప్పాలి. దివంగత మాజీ ప్రధాని కుమార్తె సురభి వాణీదేవిని పొగిడేందుకు.. ఆమె మామూలు మహిళ కాదన్న విషయాన్ని చెప్పేందుకు పడుతున్న తిప్పలు ఎంతన్నది ఈ రోజు పేపర్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
సాధారణంగా నమస్తే తెలంగాణలో ఎంతటి కీలక అంశం ఉన్నా.. తమ యజమానులైన కేసీఆర్.. కేటీఆర్ కు ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతే ఎవరికైనా ఇస్తారు. ఈ విషయాన్నితప్పు పట్టానికి కూడా ఏమీ లేదు. అలాంటిది తన తీరుకు భిన్నంగా ఈ రోజు పత్రిక మొదటిపేజీలో మంత్రి కేటీఆర్ ఫోటోను పాస్ట పోర్టు సైజు ఫోటోపెట్టి.. అందుకు భిన్నంగా.. ఎమ్మెల్సీ అభ్యర్థి వాణీదేవి ఫోటోను బిగ్గరగా వాడిన తీరు చూస్తే.. ఇంతటి ప్రాధాన్యత.. ప్రాముఖ్యత టీఆర్ఎస్ పార్టీలో ఆమెకు తప్పించి మరెవరికీ దక్కలేదన్న మాట వినిపిస్తోంది.
అంతేకాదు.. ఆమె ఇంటర్వ్యూను భారీగా ఇవ్వటమే కాదు.. ఆమెను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఎంత ఉందన్న విషయాన్ని తెలియజేసేలా సదరు పత్రిక పడిన అవస్థ ఎంతన్నది ఈ రోజు ఎడిషన్ ఇట్టే చెప్పేస్తుందని చెప్పాలి. ఇదంతా చూసినప్పుడు పేపర్ యజమాని కుటుంబంలోని కవితక్కకు కూడా ఇంతటి కవరేజ్ దక్కలేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. వాణీప్రసాద్ గెలుపు కోసం టీఆర్ఎస్ అధినాయకత్వం ఎంతటి ప్రయారిటీ ఇస్తుందన్నది ఇట్టే అర్థం కాక మానదు. మరి.. హైదరాబాద్.. రంగారరెడ్డి.. మహబూబ్ నగర్ పట్టభద్రుల ఓటర్లు ఎలాంటి తీర్పును ఇస్తారో చూడాలి.