Begin typing your search above and press return to search.
అభ్యర్ధుల్లో తూకం కుదిరినట్లేనా ?
By: Tupaki Desk | 26 Feb 2021 8:00 AM GMTత్వరలో భర్తీ చేయాల్సిన ఎంఎల్సీ అభ్యర్ధుల విషయంలో జగన్మోహన్ రెడ్డి ఆరుగురు అభ్యర్ధులను ప్రకటించారు. విజయవాడకు చెందిన కరీమున్నీసా, హిందుపురం నియోజకవర్గం ఇన్చార్జి మహమ్మద్ ఇక్బాల్, దివంగత తిరుపతి ఎంపి బల్లి దుర్గా ప్రసాదరావు కొడుకు బల్లి కల్యాణ చక్రవర్తి, శ్రీకాకుళంకు చెందిన దువ్వాడ శ్రీనివాస్, చల్లా భగీరధరెడ్డి, సీ. రామచంద్రయ్యలు ఎంఎల్సీలుగా అవకాశం దక్కించుకున్నారు.
వీరిలో కల్యాణ్ చక్రవర్తి, భగీరధరెడ్డి తండ్రులు చనిపోయిన కారణంగా వారసులుగా అవకాశం దక్కించుకున్నారు. ఇక కరీమున్నీసా, ఇక్బాల్ మైనారిటి కోటాలో అవకాశం దక్కించుకున్నారు. వీరిద్దరిలో ఇక్బాల్ రెండోసారి వరుసగా అవకాశం అందుకున్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్ మొన్నటి ఎన్నికల్లో టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేతిలో ఓడిపోయారు. అప్పుడు దువ్వాడకు ఇచ్చిన హామీ ప్రకారం ఇపుడు ఎంఎల్సీగా అవకాశం దక్కించుకున్నారు.
సీ. రామచంద్రయ్యకు కాపుల కోటాలో అవకాశం ఇచ్చినట్లున్నారు. ఈయన గతంలో మంత్రిగాను అంతకుముందు రాజ్యసభ ఎంపిగా కూడా పనిచేసున్నారు. మొత్తానికి ఎంపికైన అభ్యర్ధుల నేపధ్యం చూస్తే విధేయత, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవటం అనే అంశాల ప్రాతిపదిక మీదే వీళ్ళంతా ఎంపికైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. కాకపోతే ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న మర్రి రాజశేఖర్ కు ఇపుడు కూడా నిరాసే ఎదురైనట్లు తెలిసిపోతోంది.
ఇపుడు ఎంపిక చేసిన అభ్యర్ధుల్లో సామాజికవర్గాల తూకం కూడా సరిపోయినట్లే ఉంది. ఆరుగురిలో ఇద్దరు ముస్లిం మైనారిటీలు (ఒక మహిళ), ఒక రెడ్డి, ఒక ఎస్సీ, ఒక కాపు, ఒక బీసీలకు ప్రాతినిధ్యం కల్పించారు. మర్రికి తొందరలోనే అవకాశం కల్పించబోతున్నట్లు సమాచారం. ఎందుకంటే రాబోయే నాలుగు నెలల్లో మరిన్ని ఎంఎల్సీ స్ధానాలు ఖాళీ అవుతున్నాయి. భర్తీ అయ్యే స్ధానాలన్నీ వైసీపీ దక్కబోతున్నాయి.