Begin typing your search above and press return to search.
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్.. ఎలాంటి వేడి ఉండదట
By: Tupaki Desk | 6 Jan 2021 9:35 AM GMTఏపీలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ ను జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. అయితే.. ఈ ఎన్నికతో ఎలాంటి రాజకీయ ప్రభావం లేకపోగా.. ఫలితం కూడా డిసైడ్ అయినట్లేనని చెప్పాలి. దీనికి కారణం ఏపీ అసెంబ్లీలో అధికారపక్షానికి తిరుగులేని అధిక్యత ఉండటమే.
గతంలో టీడీపీలో ఉన్న పోతుల సునీతను ఎమ్మెల్సీని చేయటం.. ఆ తర్వాత ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరటం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన పదవికి ఆమె రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది.
ఎమ్మెల్యేలు ఎంపిక చేసే ఈ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 11న విడుదల చేస్తే.. నామినేషన్ దాఖలు చేయటానికి చివరి తేదీ ఈ నెల 18గా చెప్పాలి. పోలింగ్ ను ఈనెల 28న నిర్వహిస్తారు. అదే రోజు ఓట్ల లెక్కింపు ఉంటుంది. పోలింగ్ పూర్తి అయిన వెంటనే ఓట్ల లెక్కింపు షురూ చేస్తారు. ఆ రోజే ఎన్నికల ఫలితం కూడా వెలువడుతుంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం నామినేషన్ ను పోతుల సునీతకే ఇస్తారని.. ఎన్నికల్లో గెలుపు కూడా ఆమెదేనని స్పష్టం చేస్తున్నారు.