Begin typing your search above and press return to search.
మెగా బాబుకి ఎమ్మెల్సీ ఖాయమా?
By: Tupaki Desk | 7 Aug 2020 5:45 AM GMTశత్రువుకి.. శత్రువు మిత్రుడంటారు. ఇప్పుడు ఏపీలోని రెండు బలమైన పక్షాలైన టీడీపీ, వైసీపీకి ఉమ్మడి శత్రువుగా జనసేన ఉంది. గడిచిన హయాంలో చంద్రబాబుతో దోస్తీ చేసిన జనసేనాని పవన్ ఇప్పుడు ఆయన కాడి వదిలేసి బీజేపీతో దోస్తానా చేస్తున్నాడు. అయితే బీజేపీ మాత్రం ఏపీలో చంద్రబాబు కంటే జగన్ నే ఎక్కువగా నమ్ముతోంది. జగన్ కు కేంద్రంలో.. రాష్ట్రంలో సీట్లు ఉండడంతో ఆయన పరపతిని బీజేపీ వాడుకుంటోంది. ఈ క్రమంలోనే జగన్ తోనే తమకు మద్దతును పొందుతోంది.
తాజాగా బీజేపీ-జనసేన పొత్తులో భాగంగా ఒక ఎమ్మెల్సీ సీటును ఏపీలో పొందాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట..మెగా బ్రదర్ అయిన నాగబాబుకి వైసీపీ తరుఫున బీజేపీ కోటాలో ఎమ్మెల్సీ ఖాయం అయ్యే సూచనలు కనపడుతున్నాయని టాక్ వినిపిస్తోంది. దీని వెనుక చిరంజీవి ప్లాన్ చేశాడు అని.. సోము వీర్రాజు హైకమాండ్ తో మాట్లాడాడు అని సమాచారం. అందుకే చిరంజీవి ఇటీవల జగన్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్నాడని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
అందుకే నాగబాబు ఇటీవల కాలంలో వైసీపీ మీద విమర్శలు తగ్గించి టీడీపీ మీద సెటైర్లు.. బాలక్రిష్ణ మీద ఫైరింగ్ చేస్తున్నాడని.. ఇదంతా దాంట్లో భాగమేనని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మొత్తం మీద టీడీపీకి దూరంగా జనసేన బ్యాచ్ బీజేపీ ద్వారా వైసీపీ అనుకూల రాజకీయం మొదలుపెట్టిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.