Begin typing your search above and press return to search.
కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణారెడ్డి మృతి
By: Tupaki Desk | 1 Jan 2021 5:32 AM GMTకొత్త సంవత్సరం వేళ ఓ విషాదం గీతిక వినిపించింది. అందరూ ఆనందంలో ఉండగా.. ప్రముఖ ప్రజాప్రతినిధి కన్నుమూయడం విషాదం నింపింది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా ఆ మహమ్మారికి ఇంకా కబళిస్తూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఎవరిని వదలడం లేదు.
తాజాగా కరోనాతో ఎమ్మెల్సీ చల్లా రామకృష్ణా రెడ్డి కన్నుమూశారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందారు. కరోనాతో గత నెల(డిసెంబర్) 13న ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన కన్నుమూశారు.
కర్నూలు జిల్లా రాజకీయాల్లో చల్లా రామకృష్ణారెడ్డికి విశిష్టమైన స్థానం ఉంది. ఆయన స్వగ్రామం అవుకు మండలం ఉప్పలపాడు. తండ్రి చల్లా చిన్నపురెడ్డి. కుమారులు చల్లా భగీరథరెడ్డి, చల్లా విఘ్నేశ్వరరెడ్డి, కుమార్తెలు బృంద, పృథ్వీ. ఈయన 1983లో పాణ్యం ఎమ్మెల్యేగా గెలిపొందారు. 1989లో డోన్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
1991లో నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచి ఓటమి చవిచూశారు. 1994లో కోవెలకుంట్ల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు కర్రా సుబ్బారెడ్డి, ఎర్రబోతులను ఓడించి.. రెండు పర్యాయాలు భారీ మెజార్టీతో గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల సమయంలో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోవెలకుంట్ల స్థానం కనుమరుగయ్యింది. ఈ నియోజకవర్గంలోని దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాలు ఆళ్లగడ్డలోకి విలీనమయ్యాయి.
2014 ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరి ఆ పార్టీ అభ్యర్థి బీసీ జనార్దనరెడ్డిని ఒంటి చేత్తో గెలిపించారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వంలో ఏపీ సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేశారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేసి.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.