Begin typing your search above and press return to search.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేరాఫ్ అమెరికా!

By:  Tupaki Desk   |   18 Aug 2019 8:41 AM GMT
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కేరాఫ్ అమెరికా!
X
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డల్లాస్ మీటింగ్ లో కనిపించిన ఆ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య నలభై ఆరు అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఈ స్థాయిలో అక్కడ ఎమ్మెల్యేలు కనిపించడం పట్ల చాలా మంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. అధికార పార్టీ తరఫున ఇటీవలి ఎన్నికల్లో నెగ్గిన వారిలో దాదాపుగా ప్రతి ముగ్గురులోనూ ఒకరు డల్లాస్ లో ప్రవాసాంధ్రులతో జగన్ మీటింగ్ లో కనిపించడం గమనార్హం.

అమెరికాకు జగన్ రెండు పనుల మీద వెళ్లారు. అందులో ఒకటి యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స వాళ్లతో పెట్టుబడుల ఆహ్వానానికి సంబంధించి చర్చించడానికి, రెండోదితన ప్రైవేట్ పనుల కోసం. తన కూతురు అడ్మిషన్ ఇతర పనుల కోసం జగన్ కుటుంబంతో సహా అక్కడకు వెళ్లారు. పనిలో పనిగా ప్రవాసాంధ్రులతోనూ సమావేశం అయ్యారు.

అయితే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భారీ ఎత్తున కనిపించడం విశేషం. కొందరు అయితే సీఎం కన్నా ముందే అమెరికాకు చేరుకున్నారు. అక్కడ తాము ఏర్పాట్లను చేస్తున్నట్టుగా కొందరు కలరింగ్ ఇచ్చుకున్నారు. కొందరు మాత్రం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.

ఎమ్మెల్యేలు ఇలా అమెరికాకు క్యూ కట్టడం వెనుక వేరే కథ కూడా ఉందనే మాట వినిపిస్తోంది. ఏపీలో అయితే సీఎం చాలా బిజీబిజీగా ఉంటున్నారని, అధికారిక కార్యకలాపాలతో జగన్ తో సమావేశం కావడానికి వాళ్లకు అంత వీలు దొరకడం లేదట. అధికారిక కార్యక్రమాలకు అయితే ఎమ్మెల్యేలు వెళ్లి జగన్ ను కలవొచ్చు. అయితే వ్యక్తిగత పనుల మీద అంటే సీఎం అపాయింట్ మెంట్ దొరకడం ఏపీలో కష్టంగా ఉందట. ఇలాంటి నేపథ్యంలో అమెరికాలో అయితే అలాంటి వీలు ఏమైనా దొరుకుతుందేమో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అక్కడకు చేరుకున్నట్టుగా భోగట్టా!