Begin typing your search above and press return to search.

మా వ‌ల్ల‌కాదు: గ‌డ‌ప గ‌డ‌ప‌కు తేల్చిచెప్పిన ఎమ్మెల్యేలు.. మంత్రులు!?

By:  Tupaki Desk   |   14 May 2022 12:31 PM GMT
మా వ‌ల్ల‌కాదు:  గ‌డ‌ప గ‌డ‌ప‌కు తేల్చిచెప్పిన ఎమ్మెల్యేలు.. మంత్రులు!?
X
ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న 'గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం' కార్య‌క్ర‌మానికి ఆది లోనే అతిపెద్ద అవ‌రోధం త‌గిలింది. పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఆదేశాల‌తో(ఒక‌ర‌కంగా నిర్బంధ మే అనాలి) నాయ‌కులు బుధ‌వారం నుంచి ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్టారు. ఆదిలో అంద‌రూ.. చాలా బాగుం టుంద‌ని.. ప్ర‌జ‌లు త‌మ‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తార‌ని.. పెద్ద ఎత్తున ఊహించుకున్నారు.ఎందుకంటే.. దేశంలో ఎక్క‌డా అమ‌లు చేయ‌ని ప‌థ‌కాలు ఇక్క‌డ మాత్ర‌మే అమ‌లు చేస్తున్నామ‌ని.. ల‌క్ష కోట్ల‌కు పైగా నిదుల‌ను ప్ర‌జ‌లకు సంక్షేమం రూపంలో ఇచ్చామ‌ని.. నాయ‌కులు చెప్పుకొంటున్నారు.

సో.. ఈ ఎఫెక్ట్‌తో ప్ర‌జ‌లు త‌మ‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డ‌తారని.. ఎక్క‌డిక‌క్క‌డ పూలు ప‌రిచి మ‌రీ స్వాగ‌తం ప‌లు కుతార‌ని అనుకున్నారు. అయితే.. అనుకున్న‌ది ఒక‌టైతే.. జ‌రిగింది..మ‌రొక‌టి అన్న‌ట్టుగా.. అయిపోయిం ది ప‌రిస్థితి. మంత్రులైనా.. ఎమ్మెల్యేలైనా.. ఇలా.. ఎవ‌రు క‌నిపించినా.. ప్ర‌జ‌లు ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరి బిక్కిరి చేసేస్తున్నారు. విద్యుత్ చార్జీల పెంపు, పెట్రో చార్జీల‌ను త‌గ్గించ‌క‌పోవ‌డం.. చెత్త‌ప‌న్ను.. ఇలా.. అనేక విష‌యాల‌పై వైసీపీ మంత్రుల‌కు దాదాపు అన్ని చోట్లా ప్ర‌జ‌ల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది.

మ‌రికొన్ని చోట్ల త‌మ‌కు ఇస్తున్న పింఛ‌న్ నిలిపివేశార‌ని.. త‌మ‌కు అర్హ‌త ఉన్నా.. భ‌రోసా రాలేద‌ని, తాము అర్హుల‌మే అయిన‌ప్ప‌టికీ.. ఇళ్లు ఇవ్వ‌లేద‌ని.. ఇలా అనేక స‌మ‌స్య‌లు తెర‌మీదికి వ‌చ్చాయి. దీంతో నాయ కులు కంగుతిన్నారు. తాము ఎంతో సంక్షేమం అమ‌లు చేస్తుంటే.. వ్య‌తిరేక‌త ఎక్క‌డ ఉంటుంద‌ని.. ప‌దే ప‌దే చెప్పిన నాయ‌కులు సైతం ఈ వ్య‌తిరేక‌త చూసి.. వెన‌క్కి తిరిగి వెళ్లి పోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. వీరిలో ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ రెడ్డి, కార్మిక మంత్రి గుమ్మ‌నూరు జ‌య‌రాం, మ‌హిళా మంత్రి ఆర్కే రోజా.. ఇలా అంద‌రికీ వ్య‌తిరేక‌త ఎదురైంది.

ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నించిన ఇత‌ర నాయ‌కులు ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డ‌ప దాట‌లేదు. వర్షాలనీ, కరపత్రాలు రాలేదని కొందరు.. మరే కారణం లేకుండానే మరి కొందరు దీనికి దూరంగా ఉన్నారు. నెల్లూరు జిల్లా కావలి, నెల్లూరు సిటీ, కోవూరు, ఆత్మకూరుల్లో ఈ కార్యక్రమం అసలు ప్రారంభమే కాలేదు. గడపగడపకు వెళ్లలేనని, దానికి బదులు గ్రామసభలతో సరిపెడతానని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌ రెడ్డి పార్టీ పెద్దలకే నేరుగా చెప్పేశారని సమాచారం. 'గడప గడప'కు వెళ్లేందుకు తనకు ఆరోగ్యం సహకరించదని చెప్పినట్లు సమాచారం.

శ్రీకాకుళం జిల్లాలో మంత్రుల నియోజకవర్గాల్లో కూడా ఇంకా ఈ కార్యక్రమం ప్రారంభం కాలేదు. రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ఇంకా దీనిని ప్రారంభించ లేదు. అనంతపురం జిల్లాలో... మంత్రి ఉషశ్రీ చరణ్‌ నియోజకవర్గం కళ్యాణదుర్గంలో ఈ కార్యక్రమం ఇంకా ప్రారంభం కాలేదు. కర్నూలు, తిరుపతి, శ్రీ సత్యసాయి, కృష్ణా, ఎన్టీఆర్‌ తదితర జిల్లాల్లోనూ పలు చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభించలేదు. దీనికి కార‌ణం.. ఇప్ప‌టి వ‌ర‌కు జ‌రిగిన 'చిత్రాలు' చూసిన‌.. త‌ర్వాత‌.. ఇక గ‌డ‌ప గ‌డ‌ప‌కు వెళ్ల‌లేమ‌ని తేల్చి చెబుతున్న‌ట్టు స‌మాచారం. మ‌రిదీనిపై పార్టీ అధినేత జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి.