Begin typing your search above and press return to search.
వైసీపీ ఎమ్మెల్యేలూ.. మీకు జోహార్లు...!
By: Tupaki Desk | 23 March 2023 11:34 AM GMTకాలు జారితే వెనక్కి తీసుకోవచ్చు. కానీ మాట జారితే మాత్రం అసలు కుదరదు. ఇది ఎవరికైనా వర్తించే సూత్రమే. ముఖ్యంగా రాజకీయ నాయకులకు బాగా వర్తిస్తుంది. చంద్రబాబును అందుకే అపర చాణక్యుడు అంటారు. ఆయన వ్యూహాలు అలా పక్కాగా ఉంటాయి. ఎవరినీ తానుగా వదులుకోరు. వచ్చిన వారిని కాదని అనరు. దటీజ్ బాబు. ఈ రోజుకు కూడా చంద్రబాబు ఎవరికీ టికెట్ నో చెప్పినట్లుగా ఎక్కడా రాలేదు. ఆయన చివరి నిముషంలో ఏమైనా చెప్పినా దానికి తగిన సర్దుబాటు మంత్రం ఎటూ ఉంటుంది.
అందుకే దారుణమైన పరాజయంలో కూడా చంద్రబాబును అట్టేపెట్టుకుని 23లో 19 మంది ఎమ్మెల్యేలు అలాగే ఉన్నారు. అలా వచ్చిన నలుగురిలో సైతం సొంత కారణాలు చాలా ఉన్నాయి తప్ప బాబు వారిని పొమ్మని ఏనాడు చెప్పలేదు. అదే జగన్ వైపు చూస్తే 151 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందుకో నాలుగేళ్ళు తిరిగేసరికి ఇద్దరు ఎమ్మెల్యేలు రెబెల్స్ గా మారిపోయారు. గెలిచిన ఆరు నెలలకే ఒక ఎంపీగారు రెబెల్ గా మారి రోజూ రచ్చబండ పేరిట మీడియా ముందుకు వచ్చి సతాయిస్తునే ఉన్నారు.
వీరు కాక బయటపడని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారో బహుశా ఆ లెక్క ఎవరికీ తెలియదు అందదు కూడా. ఇదంతా ఎందుకు అంటే జగన్ తొందరపాటు తనంతో చేశారా లేక ఏదైనా వ్యూహంగా చేశారా అన్నదే చర్చ. ఆయన ఎన్నికలు రెండేళ్లు ఉండగానే గడప గడపకు అని ఒక ప్రోగ్రాం పెట్టారు. అది మంచిదే. ఎందుకంటే ఎమ్మెల్యేలు ఇంటింటికీ వెళ్ళడం వల్ల వారి సమస్యలు తెలుస్తాయి. ఎమ్మెల్యేలకు కూడా లోకల్ గా మరింత పట్టు దొరుకుతుంది.
అయితే ఆ తరువాత జగన్ వర్క్ షాప్స్ పెట్టి మరీ ఎమ్మెల్యేలకు తలంటుతూ వచ్చారు. పనితీరు బాగాలేని వారికి టికెట్లు ఇవ్వబోమని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పటికి ఎన్నికలు గట్టిగా రెండేళ్ళు ఉన్నాయి. దాంతో ఎమ్మెల్యేలు అంతా హతాశులయ్యారు దిగాలు పడ్డారు. చాలా మంది లోలోపల గొణుక్కున్నారు. ఆనాటికి జగన్ లో ఉన్న భావమేంటి అంటే ఎమ్మెల్యేలు కాదు వాలంటీర్లు ముఖ్యం, సచివాలయాలు అండగా ఉన్నాయి. పైగా పధకాలు నాతో ఉన్నాయన్న ధీమాతో అలా చేశారని అంటారు.
సరే ఎన్ని ఉన్నా ఎమ్మెల్యే అన్న వారు కూడా ఉండాలిగా వారితో పాటు క్యాడర్ ఉండాలిగా. అలా లేకపోతే పార్టీ తలచుకోకపోతే ఏమి జరుగుతుందో మూడు గ్రాడ్యుయేట్ సీట్లలో ఓటమి నిరూపించింది. ఇక ఎమ్మెల్యేల అవసరం ఉండదు అని జగన్ అనుకున్నారా లేక వారు తన మాట ప్రకారం నడుస్తారు అనుకున్నారో కానీ పదే పదే బెదరకొడుతూ టికెట్లు ఇవ్వను అని చెప్పారని ప్రచారం సాగింది.
ఇపుడు చూస్తే ఎమ్మెల్యేలకు టైం వచ్చింది. చంద్రబాబు చివరి నిముషంలో ఎనిమిదవ క్యాండిడేట్ ని దింపకపోతే ఏకగ్రీవం అయ్యేవి ఎన్నికలు.కానీ బాబు మార్క్ రాజకీయం పుణ్యమాని ప్రతీ ఎమ్మెల్యేకూ ఒక రోజు వచ్చింది. వైసీపీకి కరెక్ట్ గా 154 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. ఒక ఓటు అటూ ఇటూ కూడా పడినా మొత్తం పోయినట్లే. దాంతో ఎమ్మెల్యేల కోరికలను తీరుస్తూ వారిని బుజ్జగిస్తూ ఎన్ని చేయాలో అన్నీ చేసింది అధినాయకత్వం.
మీరు కాక మాకు ఇంకెవరూ అని కూడా భక్తి గీతాలను వైసీపీ మంత్రుల చేత పాడించింది. అయితే ఇక్కడ చిత్రమేంటి అంటే ఎమ్మెల్యేలు కూడా రాజకీయం బాగా చూసిన వారే. వారు కూడా ముదుర్లే. ఈ స్తోత్రపాఠాలు అన్నీ కూడా తమ ఓటు కోసమే అని వారికీ తెలుసు. ఒకసారి అవసరం తీరాక మళ్లీ మీకు టికెట్ ఇవ్వను అని అంటారని తెలుసు.
అందుకే వారు ఏమైనా తకరారు చేసినా తేడా చేసినా వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు. ఎమ్మెల్యేలూ మీకు జోహార్లూ అని వైసీపీ ఎంతలా పాడిన పాటలకు ఫలం ఫలితం ఏంటి అన్నది రిజల్ట్ చెప్పేస్తుంది. చూడాలి మరి ఈ హై టెన్షన్ పాలిటిక్స్ అందించే సందేశం ఏంటో. దాని ప్రభావం ఏమిటో అన్నది కూడా చూడాలి.