Begin typing your search above and press return to search.

50 మంది కాదు.. 87 మంది అంట‌!

By:  Tupaki Desk   |   18 March 2022 2:30 AM GMT
50 మంది కాదు.. 87 మంది అంట‌!
X
అదేంటి? అనుకుంటున్నారా? ఔను.. ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీలో ఈ విష‌య‌మే హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌జ‌ల మ‌ధ్య లేనివారు.. గ‌డిచిన మూడేళ్ల కాలంలో ఒక్క‌సారి కూడా నియోజ‌క‌వ‌ర్గం మొహం చూడ‌ని వారు.. ప్ర‌జ‌ల‌తో ట‌చ్‌లో లేని వారు.. ఇలా.. ఎమ్మెల్యే విష‌యంపై వైసీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ ఒక క్లారిటీకి వ‌చ్చిన‌ట్టు తెలిసింది.

ఇదే విష‌యంపై.. పార్టీ నేత‌ల మ‌ధ్య తీవ్ర‌స్థాయిలో చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఇలాంటి వారి సంఖ్య‌.. 50 మంది ఉన్నార‌ని.. పార్టీ అధిష్టానం చెబుతుంటే.. కాదు.. 87 మంది ఉన్నార‌ని.. అంటున్నారు. మ‌రి ఈ క‌థేంటో చూద్దామా!!

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీలో వైసీపీ సునామీ సృష్టించిన విష‌యం తెలిసిందే. దేశ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ ప్రాంతీయ పార్టీ కూడా సాధించ‌ని విధంగా.. వైసీపీ ఘ‌న విజ‌యం ద‌క్కించుకుంది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ద‌క్కించుకుని.. న‌వ్యాంధ్ర‌చ‌రిత్రంలోకొత్త అధ్యాయానికి తెర‌దీసింది.

అయితే.. ఇంత ఘ‌న విజ‌యం సాధించినా.. ఏదో అసంతృప్తి వెంటాడుతోంది. అదేంటంటే.. ఇటీవ‌ల ఎంపీలు క‌నిపించ‌డం లేదు! అనే బోర్డులు.. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో క‌నిపించాయి. ముఖ్యంగా జిల్లాల ఏర్పాటులో జిల్లా కేంద్రాల నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ.. చేసిన ఉద్య‌మాల‌స‌మ‌యంలో రాజంపేట‌లో ఎంపీ క‌నిపించ‌డం లేద‌నే బోర్డులు వెలిశాయి.

మ‌రోవైపు... ఎమ్మెల్యేల ప‌రిస్థితి కూడాదీనికి భిన్నంగా ఏమీలేద‌నే టాక్ వినిపిస్తోంది. ఇదిలావుంటే.. ప్ర‌స్తు తం.. శాస‌న‌స‌భా ప‌క్షంతో తాజాగా జ‌గ‌న్ భేటీ అయ్యారు. ఈ క్ర‌మంలో దాదాపు 50 మంది ఎమ్మెల్యేల‌పై ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది.

వీరిపై సేక‌రించిన స‌ర్వేలో మంచి రిపోర్టు రాలేద‌ని సాక్షాత్తూ.. ముఖ్య‌మంత్రే చెప్పిన‌ట్టు చ‌ర్చ జ‌రుగుతోంది.అయితే.. ఇలాంటి ఎమ్మెల్యేల సంఖ్య 50 కాదు.. 87 అంటున్నారు సీనియ‌ర్లు. వీళ్లంతా కూడా.. 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకున్న త‌ర్వాత‌.. క‌నీసం నెల కు ఒక్క రోజుల కూడా ప్ర‌జ‌ల‌తో మమేకం కాదేద‌ట‌.

ఇంకొంద‌రు ఎమ్మెల్యేలు.. ఏకంగా కులాల రాజ‌కీయాల‌కు తెర‌దీశార‌ట‌. అంతేకాదు.. వారివారి సామాజిక వ‌ర్గాల వారికి న్యాయం చేసి.. మిగిలిన వారికి క‌నీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌డం లేదనే టాక్ వినిపిస్తోంది. మ‌రోవైపు..మెజారిటీ ఎమ్మెల్యేలు ఏపీలో కాకుండా.. హైద‌రాబాద్‌లో త‌మ ఫ్యామిలీల‌తో ఉంటున్నార‌నే టాక్ కూడా వినిపిస్తోంది.

ఇలాంటి వారు అస‌లు నియోజ‌క‌వ‌ర్గాల‌కు కూడా వెళ్ల‌డం లేద‌ని.. అంటున్నారు. అనంత‌పురం జిల్లాకు చెందిన ఇద్ద‌రు కీలక ఎమ్మెల్యేలు.. ఏకంగా.. బెంగ‌ళూరులో రియ‌ల్ ఎస్టేట్ బిజినెస్‌లో తీరిక లేకుండా ఉంటున్నార‌ట‌.

కృష్ణాజిల్లాకు చెందిన మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే ఒక‌రు కూడా హైద‌రాబాద్‌కే ప‌రిమిత‌మ‌య్యారు. చిత్తూరులో కొంద‌రు చెన్నైలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని.. అక్క‌డ నుంచేపోన్ల‌లో కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నారు. మ‌రికొంద‌రు.. వ్యాపారాల నిమిత్తం వ‌చ్చి పోతున్నారు.

ఇక‌, ప్ర‌కాశంలోనూ.. ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. ఇలా ఎవ‌రికి వారు.. త‌మ త‌మ ప‌నుల్లో బిజీగా ఉన్నార‌ని.. రిపోర్టులు వ‌చ్చాయ‌ట‌. దీంతో ఇదే విష‌యంపై ఎమ్మెల్యేలు చ‌ర్చించుకుంటున్నారట‌. మ‌రోవైపు... వీరినే న‌మ్ముకున్న ప్ర‌జ‌లు మా బిల్లులు మాకు ఇప్పించండి అని ఇళ్ల‌కు మీద‌కు వ‌స్తున్నార‌ట‌. దీంతో ఏమీ చెప్ప‌లేక‌.. హైద‌రాబాద్‌, బెంగ‌ళూరులోనే ఉంటున్నార‌ట‌. ఇదే విష‌యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మార‌డం గ‌మ‌నార్హం.