Begin typing your search above and press return to search.

ఎంఎల్ఏల ఫోన్లు స్విచ్చాఫా ?

By:  Tupaki Desk   |   23 March 2023 11:06 AM GMT
ఎంఎల్ఏల ఫోన్లు స్విచ్చాఫా ?
X
విషయం ఎంతవరకు నిజమో తెలీదుకానీ ప్రచారమైతే ఒక్కసారిగా మొదలైంది. ఎంఎల్ఏల కోటా ఎంఎల్సీ ఎన్నికలకు పోలింగ్ మొదలైన విషయం తెలిసిందే. ఏడుస్ధానాలకు ఎనిమిదిమంది అభ్యర్ధులు పోటీచేస్తున్నారు. వైసీపీ నుండి ఏడుగురు పోటీచేస్తుంటే టీడీపీ తరపున ఒకళ్ళు పోటీచేస్తున్నారు. తమ ఏడుగురు అభ్యర్ధులను గెలిపించుకోవాలని జగన్మోహన్ రెడ్డి బాగా పట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో తమ అభ్యర్ధిని గెలిపించుకుని జగన్ను దెబ్బకొట్టాలని చంద్రబాబునాయుడు కూడా అంతేపట్టుదలగా పావులు కదుపుతున్నారు.

ఇందులో భాగంగానే రెండుపార్టీలు తమ ఎంఎల్ఏలతో శిబిరాలు ఏర్పాటుచేసుకున్నాయి. బ్యాచులవారీగా వైసీపీ తన ఎంఎల్ఏలను అసెంబ్లీ కమిటిహాలుకు పిలిపించుకుని ఓటింగ్ చేయించుకుంటోంది. మూడురోజులుగా రెండుపార్టీలు మాక్ పోలింగ్ నిర్వహించుకుంటున్న విషయం తెలిసిందే. టీడీపీ ఒక శిబిరం నిర్వహిస్తే వైసీపీ మూడు శిబిరాలు నిర్వహించింది. ఇప్పుడు విషయం ఏమిటంటే బుధవారం అర్ధరాత్రి తమ శిబిరాల్లో నుండి నలుగురు ఎంఎల్ఏలు బయటకు వెళ్ళిపోయారనే ప్రచారం మొదలైంది.

ఎంఎల్ఏలు మద్దాలిగిరి, ఉండవల్లి శ్రీదేవి, వాసుపల్లి గణేష్ కుమార్, వసంత కృష్ణప్రసాద్ శిబిరం నుండి వెళ్ళిపోయారని తెలిసింది. అలాగే అప్పటినుండి వీళ్ళ ఫోన్లు కూడా స్విచ్చాఫులో ఉన్నాయట. ఈ విషయమే వైసీపీ అధిష్టానంలో టెన్షన్ పెంచేస్తోందన్నది సారంశం. ఎంఎల్ఏలు శిబిరం నుండి వెళ్ళిపోవటం, తమ ఫోన్లను స్విచ్చాఫ్ చేసుకున్నారనే విషయాన్ని వైసీపీలో ఎవరూ ధృవీకరించటంలేదు. అలాగే ఖండించటమూ లేదు. ఎందుకంటే ఒక శిబిరంలోని ఎంఎల్ఏలతో మరో శిబిరంలోని ఎంఎల్ఏలకు సంబంధాలు లేకుండా మూడు శిబిరాలు నిర్వహిస్తున్నారు.

ఎవరికి కేటాయించిన సమయం ప్రకారం వాళ్ళని అసెంబ్లీకి తీసుకొచ్చి ఓట్లేయించే బాధ్యతలను మంత్రులకు కేటాయించారు. ఇప్పుడు ప్రచారం జరుగుతున్న ఎంఎల్ఏల్లో మద్దాలిగిరి, వాసుపల్లి గణేష్ టీడీపీ తరపున గెలిచి తర్వాత పార్టీకి దూరమైన వాళ్ళు. ఇక వసంత, శ్రీదేవి డైరెక్టుగా వైసీపీ తరపునే గెలిచారు. ఏదేమైనా పోలింగ్ మొదలైన తర్వాత నలుగురు ఎంఎఏల విషయంలో ఇలాంటి ప్రచారం మొదలవ్వటంతో అందరిలోను టెన్షన్ పెంచేస్తోంది. ఒక్క ఓటు కోసం రెండుపార్టీలు నానా అవస్తలు పడుతున్న సమయంలో నలుగురు ఎంఎల్ఏలంటు జరుగుతున్న ప్రచారం చాలా పెద్ద విషయమే అనటంలో సందేహంలేదు.