Begin typing your search above and press return to search.

అసెంబ్లీ లోకి టీ షర్ట్ తో ఎమ్మెల్యే...బయటకు పంపిన స్పీకర్

By:  Tupaki Desk   |   16 March 2021 5:16 AM GMT
అసెంబ్లీ లోకి టీ షర్ట్ తో ఎమ్మెల్యే...బయటకు పంపిన స్పీకర్
X
గుజరాత్ బడ్జెట్‌ సమావేశాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే విమల్‌ చూడాసమా జీన్స్‌, టీషర్ట్‌ ధరించి రావడం తో దానిపై కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. ఎమ్మెల్యే విమల్ చూడాసమా.. బ్లాక్ ఫ్రీ నెక్ టీ షర్ట్‌ ధరించి అసెంబ్లీకి వచ్చారు. ఇంతలో ఈ అంశంపై అసెంబ్లీ స్పీకర్ రాజేంద్ర త్రివేది.. సభ గౌరవాన్ని అందంగా తీర్చిదిద్దే దుస్తులు ధరించి రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనితో ఆఎమ్మెల్యే మాట్లాడుతూ .. తాన ధరించిన దుస్తులు తగినవి కావని తెలిపే చట్టాలేమైనా ఉన్నాయా, ఉంటే చూపాలని అని విమల్ చూడాసమా పట్టుబట్టారు. స్పీకర్‌ ఆదేశాలను ఎమ్మెల్యే అంగీకరించకపోవడంతో ఆయనను మూడు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేయాలని హోంమంత్రి ప్రదీప్సింగ్ జడేజా ప్రతిపాదించారు.

సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలని, సంస్కృతి, సాంప్రదాయానికి అనుగుణంగా ఉండే దుస్తులు ధరించి అసెంబ్లీ గౌరవాన్ని ఇనుమడింపజేయాలని గుజరాత్‌ అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర త్రివేది.. బడ్జెట్ సమావేశాల తొలిరోజునే సభ్యులకు సూచించారు. అయితే, స్పీకర్‌ సూచనలను పక్కనపెట్టిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే విమల్‌ చూడాసమా నలుపు రంగు ఫ్రీ నెక్‌ టీషర్ట్‌ జీన్స్‌ ధరించి సోమవారం అసెంబ్లీ సమావేశాలకు వచ్చారు. ఈయన దుస్తులను గమనించిన స్పీకర్‌ రాజేంద్ర త్రివేది ఒక్కసారి మండిపడ్డారు.సభ మొదటి రోజే చెప్పాం కదా, అందరం సభ గౌరవాన్ని కాపాడేలా మంచి దుస్తులు ధరిద్దామని అనుకున్నాం కదా, మళ్లీ ఇదేం పిచ్చిపనులు. అలా జీన్స్‌, టీషర్ట్‌ ధరించిరావడం సభను అగౌరవపరచడమే అన్నారు.

దీనిపై ఎమ్మెల్యే విమల్‌ చూడాసమా మాట్లాడుతూ ... సభలో ఎలాంటి దుస్తులు ధరించాలో వారెవరు, అలాంటి చట్టం ఏమైనా ఉన్నదా, ఈ జీన్స్‌, టీ షర్ట్‌ ధరించడం వల్లనే కాంగ్రెస్‌ పార్టీ టిక్కెట్‌ ఇచ్చింది. ఇలాంటి దుస్తులు ధరించడాన్ని చూసే ప్రజలు ఓటేసి అసెంబ్లీకి పంపారు. ఇలా దుస్తుల పేరుతో సభ నుంచి బయటకు పంపడం విచారకరం. ఎందరో టీషర్టులు, జీన్స్‌ ధరించి అసెంబ్లీకి వస్తున్నారు. వారిని కాదని నాపై చర్యలు తీసుకోవడం కేవలం నేను బీసీనని. నా దుస్తులను టార్గెట్‌గా చేసుకుని బీజేపీ ప్రభుత్వం తన సమాజాన్ని అవమానించింది’ అని చెప్పారు.