Begin typing your search above and press return to search.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం..ఎమ్మెల్యే సతీమణికి గాయాలు

By:  Tupaki Desk   |   8 Jan 2022 5:52 AM GMT
టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం..ఎమ్మెల్యే సతీమణికి గాయాలు
X
తెలంగాణ అధికారపక్షం టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే ఒకరింట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ తెల్లవారుజామున (శనివారం) చోటు చేసుకునన ఈ అగ్ని ప్రమాదంలో ఎమ్మెల్యే సతీమణి గాయాలపాలయ్యారు. ఎమ్మెల్యే ఇంట్లో అగ్ని ప్రమాదమా? ఎలా జరిగింది? అన్న విషయంలోకి వెళితే..

జగిత్యాల జిల్లా కోరుట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు తెల్లవారుజామున మెట్ పల్లిలోని వారి సొంతింట్లో ఎమ్మెల్యే సతీమణి సరోజా ఇంట్లో పిండి వంటలు చేస్తున్నారు. ఈ సందర్భంగా గ్యాస్ లీకైంది. దీంతో.. మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే సతీమణికి గాయాలు అయినట్లుగా తెలుస్తోంది.

అగ్నిప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే.. ఫైరింజన్ సిబ్బంది ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి.. మంటల్ని ఆర్పివేశారు. అదే సమయంలో గాయాల బారిన పడిన ఎమ్మెల్యే సతీమణికి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే సతీమణి ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఎమ్మెల్యే కుమారుడు డాక్టర్ సంజయ్ ఒక ప్రకటన చేశారు.