Begin typing your search above and press return to search.

అంబులెన్స్ రాలేదని గర్భవతిని 6 కిలో మీటర్లు మోసిన ఎమ్మెల్యే !

By:  Tupaki Desk   |   11 Feb 2020 7:45 AM GMT
అంబులెన్స్ రాలేదని గర్భవతిని 6 కిలో మీటర్లు మోసిన ఎమ్మెల్యే !
X
ప్రజాప్రతినిధులు అంటే ప్రజలపై తమ ఆధిపత్యం చూపించేవారు కాదు. ప్రజల కోసం పనిచేసేవారు. కానీ , ప్రస్తుత రోజుల్లో కొందరు ప్రజాప్రతినిధులు కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజల భాగోగులని పట్టించుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తరువాత , మళ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఆయన్ని టీవీ లోనే ., పేపర్ లోనే చూడటం తప్ప ..డైరెక్ట్ గా కలవడం చాలా కష్టంగా మారుతోంది. కానీ , కొందరు మాత్రం నిత్యం ప్రజల్లో ఉంటూ , ప్రజలకి అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికై పోరాటం చేస్తుంటారు. అలాగే మరి కొంతమంది ఏదైనా జరిగినప్పుడు తమ ఉదారతని చాటుకుంటుంటారు.

ఏదైనా యాక్సిడెంట్స్ కానీ , అనుకోని ప్రమాదాలు కానీ జరిగినప్పుడు అక్కడ ఉన్న లేదా అటువైపు వెళ్లే ప్రజాప్రతినిధులు ఆగి , ఆ సమస్య ని అక్కడికక్కడే పరిష్కరించి కానీ వెళ్లడంలేదు. తాజాగా మరో ఎమ్మెల్యే తన ఉదారతని చాటుకున్నారు. గ్రామ పర్యటనకి వెళ్లిన ఎమ్మెల్యే కి ఆ గ్రామం లో ప్రసవ వేదన తో భాద పడుతున్న ఒక గర్భవతి కనిపించింది. ఆమెని ఆసుపత్రిలో అంబులెన్స్ ని పిలిపించి వెంటనే చేర్పించాలని తెలిపారు. కానీ , ఆ గ్రామానికి రోడ్లు భాగాలేకపోవడం తో అంబులెన్స్ గ్రామంలోకి రావడానికి నిరాకరించారు. దీనితో స్థానిక ఎమ్మెల్యే తో పాటు మరికొందరు గర్బవతిని ఆరు కిలోమీటర్లు మోసి.. ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే చేసిన ఈ సేవకు సోషల్ మీడియా లో ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త కాస్తా సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఒడిశాలోని దబూగాం నియోజక వర్గానికి ఈయన ఎమ్మెల్యే గా ఉన్నారు. ఈయన ఎమ్మెల్యే మన్హర్ రంధారి.