Begin typing your search above and press return to search.
అక్కడ బాబు మీటింగ్...వైసీపీతో టీడీపీ ఎమ్మెల్యే...?
By: Tupaki Desk | 5 May 2022 11:30 PM GMTరాక రాక చంద్రబాబు విశాఖ వచ్చారు. ఆయన విశాఖలో పార్టీ ఆఫీస్ లోనే రాత్రి బస చేశారు. తెల్లారుతూనే పార్టీ నాయకులతో మాటా మంతీ చేశారు. పార్టీ పరిస్థితిని ఆయన అందరినీ అడిగి తెలుసుకున్నారు. ఇక పార్టీ ఎమ్మెల్యేలు, కీలక నాయకులతో ఒక కీలకమైన మీటింగ్ ని కూడా నిర్వహించారు. బాబు నిర్వహించిన ఈ మీటింగునకు విశాఖ జిల్లాలో ఆ పార్టీ తరఫున గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు మాత్రమే హాజరయ్యారు.
ఇక మరో ఇద్దరిలో ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎందుకు గైర్ హాజర్ అయ్యారో అధినాయకత్వానికే తెలియాలి. ఇక దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అయితే రెండేళ్ళ క్రితమే వైసీపీకి మద్దతు ఇచ్చారు. దాంతో ఆయన టీడీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే ఈ మధ్య ఆయన వైసీపీకి కూడా దూరంగా తన పనేంటో తానేంటో అన్నట్లుగా ఉంటున్నారు అని ప్రచారం సాగుతోంది. ఆయన మళ్లీ టీడీపీలోకి వెళ్తారు అన్న వార్తలు కూడా వినిపించాయి. ఈ నేపధ్యంలో సడెన్ గా ఆయన వైసీపీ ఆఫీస్ లో కనిపించారు.
అది కూడా తనకు టికెట్ ఇచ్చి గెలిపించిన టీడీపీ అధినాయకుడు చంద్రబాబు ఊళ్ళో ఉన్న వేళ. అక్కడ ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడితే ఈ రోజుకీ టెక్నికల్ గా టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వాసుపల్లి అక్కడికి వెళ్ళకపోవచ్చు కానీ గమ్మునుండకుండా వైసీపీ ఆఫీస్ లో మీటింగులో పాలుపంచుకోవడం అంటే నిజంగా అది తమ్ముళ్ళకు మంటగానే ఉందిట.
ఇంతకీ వాసుపల్లి వైసీపీ ఆఫీస్ లో ఎందుకు ఉన్నారు. అంత అర్జంట్ మీటింగ్ అక్కడ ఏంటి అన్నది చూస్తే ఉమ్మడి విశాఖ జిల్లా వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ గా వైవీ సుబ్బారెడ్డి నియమితులైన సంగతి విధితమే. దాంతో ఆయన ఈ నెల 7న విశాఖ వస్తున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలకడానికి వైసీపీ సకల ఏర్పాట్లను చేయడానికి సంబంధించిన సన్నాహక మీటింగ్ అది. దానికి అటెండ్ అయిన వాసుపల్లి బాబుకు ఎదురు నిలబడి మళ్ళీ కళ్ళలో పడ్డారు.
మరి ఈ పరిణామాలను చూసిన వారు వాసుపల్లి ఇక వైసీపీలో కంటిన్యూ అవుతారా అంటే అది మాత్రం అడగవద్దు అనే జవాబు వస్తోంది. ఎందుకంటే ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ వ్యవధి ఉంది. అప్పటికి ఎన్ని మార్పులూ చేర్పులూ ఉంటాయో. రాజకీయాలు ఎంతలా మారుతాయో. సో వాసుపల్లి మాత్రం ఈ రోజుకు ఇలా బాబుకు భలే ఝలక్ ఇచ్చారని వైసీపీ నేతలు అంటూంటే ఆయన మీద తమ్ముళ్ళు గుర్రుగా ఉన్నారు.