Begin typing your search above and press return to search.

'నేను నీ అమ్మ మొగుడిని'.. వైసీపీలో మ‌రో 'అమ్మ మొగుడు' నేత‌!

By:  Tupaki Desk   |   9 April 2022 4:19 AM GMT
నేను నీ అమ్మ మొగుడిని.. వైసీపీలో మ‌రో అమ్మ మొగుడు నేత‌!
X
అమ్మ మొగుడు! ఈ ప‌దం కృత‌కంగా ఉంటుంద‌ని... అగౌర‌వ‌మ‌ని తెలుసు! అయితే.. వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని.. ఈ ప‌దాన్ని అధికారికం చేశారు. ఆయ‌న నోరు విప్పితే.. `నీ అమ్మ‌మొగుడు` అని వ్యాఖ్యా నించి.. మంత్రి వ‌ర్గంలో ``అమ్మ మొగుడు మంత్రి`` అని నెటిజ‌న్ల‌తో కామెంట్లు చేయించుకున్నారు. అయితే.. ఇప్పుడు ఈయ‌న‌కు మ‌రో నేత తోడ‌య్యాడు. ఆయ‌న కూడా ఎన్టీఆర్ జిల్లా కు చెందిన నాయ‌కుడే కావ‌డం విశేషం. అది కూడా గ‌తంలో కొడాలి ఎవ‌రిపై నైతే విరుచుకుప‌డ్డారో.. నేరుగా ఆయ‌న‌ పైనే ఈ అమ్మ‌ మొగుడు నేత కూడా విరుచుకుప‌డ్డారు.

ఎవ‌రు? ఎందుకు?

గ‌త ఎన్నిక‌ల్లో మైల‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌ర‌ఫున దేవినేని ఉమా పోటీ చేస్తే.. ఆయ‌న‌ పై వైసీపీ త‌ర‌ఫున వ‌సంత కృష్న ప్ర‌సాద్ పోటీకి దిగారు. ఉమా ఓడిపోయి.. వ‌సంత గెలిచారు. అప్ప‌టి నుంచి ఇద్ద‌రి మ‌ధ్య రాజ‌కీయ వివాదాలు.. కీచులాట‌లు కామ‌న్ గా మారిపోయాయి. ఈ క్ర‌మంలో తాజాగా దేవినేని ఉమా పై అమ్మ మొగుడు.. అంటూ.. వ‌సంత కూడా నోరు పారేసుకుని కామెంట్లు చేశారు. ఎన్‌టీఆర్‌ జిల్లా గుంటుపల్లిలో వలంటీర్ల పురస్కార సభ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మంలో స్థానిక ఎమ్మెల్యే వ‌సంత కూడా పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేవినేని ఉమా పై విరుచుకు ప‌డ్డారు. ‘నీ పదవి ఊడగొట్టాను.. నీకు అవకాశం లేకుండా చేశాను.. దద్దమ్మ, సన్నాసీ అని అంటున్నావు.. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్రంలో రూ.70 వేల కోట్లు ఖర్చుపెట్టానని చెప్పుకునే నిన్ను ఓడించా.. నిన్ను ఓడించిన నేను సన్నాసిని, దద్దమ్మను ఎందుకు అవుతాను.. నీ అమ్మ మొగుడిని అవుతాను’ అని దేవినేని ఉమా ను ఉద్దేశించి వసంత తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు. దీంతో అంద‌రూ ఒక్క‌సారిగా ఉలిక్కి ప‌డ్డారు.

మ‌హిళ‌లు ఉన్నార‌ని తెలిసి కూడా..

వ‌సంత ఇంత తీవ్ర వ్యాఖ్య‌లు చేసిన సమయంలో వేదికపై ఆయన పక్కనే ఇబ్రహీంపట్నం మండలా ధ్యక్షురాలు, వైసీపీ నాయ‌కురాలు.. పాలడుగు జ్యోత్స్న ఉన్నారు. అయిన‌ప్ప‌టికీ.. వ‌సంత ఎక్క‌డా త‌గ్గ‌కుండా.. బూతుల‌తో విరుచుకుప‌డ్డారు. వాస్త‌వానికి దేవినేని ఉమ సోదరుడు చంద్రశేఖర్‌ వసంత కృష్ణప్రసాద్‌కు సన్నిహితుడు. గత ఎన్నికల్లో కృష్ణప్రసాద్‌ విజయానికి కృషిచేశారు. కనీసం ఆయనపైనా గౌరవం లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని వైసీపీ శ్రేణులుసైతం తప్పుబడుతున్నాయి.

మంత్రి ప‌ద‌వి పై ప‌ట్టుకోస‌మా?

మరోవైపు టీడీపీ కార్యకర్తలూ ఆయనపై మండిపడుతున్నారు. నిన్నటి వరకు కొడాలి నాని బూతుల మంత్రిగా పేరు తెచ్చుకుని రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన స్థానాన్ని భర్తీ చేయాలన్న ఆలోచనతో ఎమ్మెల్యే బూతుల బాధ్యత తీసుకున్నారా అని ప్రజలు చర్చించుకుంటున్నారు.