Begin typing your search above and press return to search.

వల్లకావడంలేదా...వల్లభనేని వంశీ సైలెంట్ వెనక...?

By:  Tupaki Desk   |   10 Oct 2022 2:30 AM GMT
వల్లకావడంలేదా...వల్లభనేని వంశీ సైలెంట్ వెనక...?
X
ఏదో అనుకుంటే మరేదో అయింది అని ఒక సామెత. ఇపుడు అలాంటి పరిస్థితినే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఎదుర్కొంటున్నారా అంటే అవును అని జవాబు వస్తోంది. వంశీ టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్. నిజానికి ఆయన పార్టీ మారడమే ఒక రాంగ్ డెసిషన్ అనే వారూ ఉన్నారు. వంశీకి టీడీపీ ఎంతో ప్రయారిటీ ఇచ్చింది. ఇక ఆయన కూడా జగన్ వేవ్ లో సైతం గెలిచి తన పట్టుని నిరూపించుకున్నారు. అయితే సడెన్ గా ఆయన వైసీపీలోకి జంప్ అయ్యారు. దానికి కారణం జగన్ కంటే తన జిగినీ దోస్త్ కొడాలి నాని మంత్రి అయ్యారు, దాంతో ఆయన ప్రోత్సాహంతో అలా జంప్ చేశారు అనుకోవాలి.

సరే జంప్ చేశారు. వైసీపీలోకి వచ్చి బావుకుంది ఏంటి అంటే వంశీ అనుచరులకే జవాబు లేదు. ఆయన రాక పట్ల వైసీపీ వర్గాలు వెల్ కమ్ చెప్పడంలేదు సరికదా వర్గ పోరుతో ఆయన బుర్ర హీటెక్కిస్తున్నారు. పోని అధికార పార్టీలో దర్జా ఏమైనా ఉందా అంటే అందరి ఎమ్మెల్యేల మాదిరిగానే కధ ఉంది. ఇక విపక్షంలో ఉంటే సర్కార్ ని విమర్శిస్తూ హైలెట్ అయ్యేవారు. ఇపుడు అలా కాకుండా నోరు కట్టేసుకున్నారు.

వైసీపీలోకి వచ్చాక జగన్ కోసమో లేక కొడాలి నాని కోసమో తెలియదు కానీ టీడీపీ అధినాయకుడు చంద్రబాబు మీద, లోకేష్ మీద ఒక రేంజిలో వంశీ రెచ్చిపోయి కామెంట్స్ చేశారు. ఒక దశలో అవి హద్దులు మీరాయన్న విమర్శలు వచ్చాయి. అదే టైమ్ లో అనుచితమైన కామెంట్స్ చంద్రబాబు కుటుంబం మీద చేసి ఆయనను ఏడిపించారు అన్న అపవాదుని మూటకట్టుకోవాల్సి వచ్చింది.

ఈ నేపధ్యాన్ని చూసిపపుడు వైసీపీని ఎంతలా నమ్మారో అంతాలా నమ్మేసిన వంశీ టీడీపీలో డోర్స్ క్లోజ్ అనిపించేసుకున్నారు. ఇపుడు వైసీపీలో చూస్తే టికెట్ దక్కుతుంది అన్న గ్యారంటీ లేదు. ఒకవేళ ఇచ్చినా గెలుస్తారు అన్న భరోసా అసలు లేదు. వీటికి తోడు అన్నట్లుగా విజయవాడ హెల్త్ వర్శిటీకి ఎంటీయార్ పేరుని సడెన్ గా మార్చేసి జగన్ షాక్ ఇచ్చేశారు. ఈ పరిణామాలతో వంశీ తీవ్రంగా ఇబ్బందుల్లో పడిపోయారు అని అంటున్నారు.

ఎంటీయార్ పేరుని తొలగించినా ఆ పార్టీలో ఉండి ఎన్నికల్లో పోటీ చేస్తే గన్నవరంలో ఇబ్బందే అని మరో విశ్లేషణ ఉంది. దీంతో ఏం చేయాలో పాలుపోక వంశీ మౌనాన్ని ఆశ్రయించారు అని అంటున్నారు. ఈ నేపధ్యంలోనే ఆయన వైసీపీ మీద తన అభిప్రాయాలను సానుకూలతను కూడా మార్చుకున్నారా అన్న డౌట్లు వస్తున్నాయట. తన జిగినీ దోస్త్ కొడాలి నాని మీద అమరావతి రైతులు హాట్ కామెంట్స్ చేసినా వంశీ పెదవి విప్పలేదు. అలాగే వికేంద్రీకరణకు అనుకూలంగా వైసీపీ నేతలు అంతా మాట్లాడుతున్నా వంశీ మాత్రం సౌండ్ చేయడంలేదు.

దాంతో ఆయన తన స్టాండ్ మార్చుకున్నారు అని అంటున్నారుట. దీంతో వంశీ వ్యవహార శైలి మీద వైసీపీ అధినాయకత్వం ఫుల్ ఫోకస్ పెట్టింది అని అంటున్నారు. పర్టీ నుంచి వంశీ తప్పుకున్నా వైసీపీకి ఏమీ ఇబ్బంది లేదు. ఎటూ దుట్టా రామచంద్రరావు, యార్లగడ్డ వెంకటరావు ఉన్నారు. వారిలో ఒకరికి టికెట్ ఇస్తుంది. కానీ వంశీ పార్టీ మారితే టీడీపీ ఆప్షన్ ఇవ్వదు, జనసేనలో అవకాశం అంతకంటే ఉండదు, దాంతో ఆయన రాజకీయం అయోయమంలో పడింది అని అంటున్నారు. చేరితే బీజేపీ లాంటి పార్టీలో చేరాలి, లేదా గుడ్ బై కొట్త్టాఇ మరి వంశీ ఎలా ఆలోచిస్తున్నారో మాత్రం తెలియడం లేదు. ఏది ఏమైనా వైసీపీలో ఉండడం తన వల్ల కాదనే వంశీ అంటున్నారా అన్నదే చర్చగా ఉంది మరి.