Begin typing your search above and press return to search.
పెద్దాయన కుటుంబంలో ఎమ్మెల్యే టికెట్ల చిచ్చు!
By: Tupaki Desk | 4 April 2023 1:03 PM GMTకర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. మే నెలలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, మరోపార్టీ జేడీఎస్ టికెట్ల కసరత్తులో తలమునకలై ఉన్నాయి. అయితే మాజీ ప్రధాని దేవగౌడ సారధ్యంలోని జనతాదళ్ (సెక్యులర్)కు సొంత ఇంటిలోనే అసమ్మతి పోరు తలెత్తింది.
ఇప్పటికే కుటుంబ పార్టీగా ముద్రపడ్డ జేడీఎస్ కు తాజా పరిణామాలు కలవరపాటుకు గురి చేస్తున్నాయని అంటున్నారు. దేవగౌడ చిన్న కుమారుడు మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి, ఆయన కుమారుడు, సినీ హీరో నిఖిల్, దేవగౌడ పెద్ద కుమారుడు, మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ వచ్చే ఎన్నికల బరిలో ఉన్నారు. వీరు చాలదన్నట్టు ఇప్పుడు దేవగౌడ పెద్ద కోడలు అంటే రేవణ్ణ సతీమణి కూడా తనకు టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. దీంతో దేవగౌడ తలపట్టుకుంటున్నారట.
దేవగౌడ పెద్ద కోడలు, రేవణ్ణ సతీమణి భవానీ జేడీఎస్ కు కంచుకోట అయిన హసన్ నియోజకవర్గం నుంచి రాజకీయ అరంగేట్రం చేస్తానని పట్టుబడుతున్నారు. రేవణ్ణ కూడా తన భార్య మాటకు వంతపాడుతుండటం దేవగౌడకు ఇబ్బంది సృష్టిస్తోందని చెబుతున్నారు. ఇప్పటికే జేడీఎస్ కుటుంబ పార్టీ అని ప్రత్యర్థి పార్టీలు ముద్ర వేశాయి. ఈ తరుణంలో ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాల్సి ఉండగా సొంత కుటుంబంలోనే వివాదాలు రాజుకున్నాయి.
మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి మాత్రం తన వదిన కోరుతున్న హసన్ స్థానంలో మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్ కుమారుడు స్వరూప్ ను నిలబెట్టాలని తలపోస్తున్నారు.
ఇప్పటికే తమ కుటుంబం నుంచి తనతోపాటు, తన కుమారుడు నిఖిల్, అన్న రేవణ్ణ పోటీ చేస్తున్నారని.. ఇంకా కుటుంబ సభ్యులు పోటీ చేయడం సరికాదని ఆయన చెబుతున్నారు. దేవగౌడ కూడా కుమారస్వామి మాటకే మొగ్గు చూపుతున్నారు. అయితే రేవణ్ణ, ఆయన భార్య భవానీ మాత్రం ఇందుకు ససేమిరా అంటున్నారని తెలుస్తోంది. తన భార్య భవానీ కి అవకాశం ఇవ్వకపోతే తాను హొళెనరసీపుర బదులుగా హసన్ నుంచే పోటీ చేస్తానని రేవణ్ణ ఇప్పటికే తేల్చిచెప్పారు.
దీంతో దిద్దుబాటు చర్యల్లో భాగంగా తన ఇద్దరు కుమారులతో బెంగళూరులోని తన నివాసంలో దేవగౌడ సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం ప్రారంభమైన 15 నిమిషాలలోనే రేవణ్ణ భార్య భవానీ అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయారని తెలుస్తోంది. ఆ తర్వాత మరికొంత సమయానికి రేవణ్ణ కూడా వెళ్లిపోవడంతో సమస్య కొలిక్కి రాలేదు.
కాగా సమస్య పరిష్కారం పై తన చిన్న కుమారుడు కుమారస్వామితో దేవగౌడ మరో విడత చర్చలు జరిపారు. పార్టీ అధికారంలోకి వస్తే భవానీకి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరి ఈ ప్రతిపాదనకు దేవగౌడ పెద్ద కోడలు భవానీ అంగీకరిస్తారో, లేదో వేచిచూడాల్సిందే.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.