Begin typing your search above and press return to search.

ఈసారి దేశంలోనే ఆదర్శ ఎమ్మెల్యే ‘‘తమ్ముడే’’

By:  Tupaki Desk   |   10 Jan 2016 10:04 AM IST
ఈసారి దేశంలోనే ఆదర్శ ఎమ్మెల్యే ‘‘తమ్ముడే’’
X
ఒక అరుదైన గౌరవం తెలుగుదేశం పార్టీకి చెందిన నేతకు దక్కింది. దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల్లో ఆదర్శ ఎమ్మెల్యేగా తెలుగు తమ్ముడు ఎంపికయ్యారు. ఫూణేలోని ఎంఐటీ స్కూల్ ఆఫ్ గవర్నరమెంట్ సంస్థ ప్రతి ఏటా.. ఆదర్శ ఎమ్మెల్యేల్ని ఎంపిక చేసి అవార్డు ఇస్తుంది. ‘‘ఆదర్శ్ యువ విధాయక్’’ పేరిట ఇచ్చే ఈ అవార్డుకు ఈ ఏడాది తెలుగుదేశం పార్టీకి చెందిన ఏపీ ఎమ్మెల్యే ఎంపిక కావటం విశేషం.

పశ్చిమగోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే శివరామరాజు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేల పనితీరును పరిశీలించిన తర్వాత ఈ పురస్కారాన్ని ప్రకటిస్తుంటారు. ఈ నెల 27న జరిగే కార్యక్రమంలో తెలుగు తమ్ముడికి అవార్డును ప్రదానం చేయనున్నారు.

తనకు వచ్చిన అవార్డు గురించి శివరామ రాజు.. ఏపీ ముఖ్యమంత్రి కమ్ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు ఇలాంటి గౌరవం దక్కటం పట్ల బాబు హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇలాంటి వాటికి ఏ అధినేత మాత్రం హ్యాపీగా ఫీల్ కారు?