ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేలకు నోరు కుదురుగా ఉండడం లేదు. అధికారులపై నోరు జారేస్తున్నారు. తర్వా త.. తీరిగ్గా మీడియాలో వచ్చిన తర్వాత సరిచేసుకుంటున్నారు. కొన్నాళ్ల కిందట సాక్షాత్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా.. అధికారులపై నోరు పారేసుకున్నారు. స్పాట్‌లో కొడతా!! అంటూ.. వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఇలానే ఓ ఎమ్మెల్యే ఏకంగా.. జిల్లా కలెక్టర్‌కే చదువు రాదులే!! అనే అనేశారట. దీంతో ఇప్పుడు ఈ విషయం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. విషయంలోకి వెళ్లే ప్రకాశం జిల్లాలో ఓ ఎమ్మెల్యే చిత్రంగా మాట్లాడుతున్నారనే ప్రచారం ఉంది.
ఇటీవల ఆ ఎమ్మెల్యే దగ్గరకు కొంతమంది టీచర్లు వచ్చి.. ఒక స్కూల్ స్థలానికి సంబంధించి చర్చించారు. స్కూల్‌కు సంబందించిన స్థలం.. అటవీ శాఖ పరిధిలో ఉందని.. అయితే.. ఆ స్థలాన్ని స్కూల్‌కు గ్రౌండ్ కింద కేటాయిస్తే.. పిల్లలకు ఆడుకునేందుకు అనువుగా ఉంటుందని.. కాబట్టి స్థలాన్ని స్కూల్‌కు కేటాయిం చేలా చూడాలని వారు ఎమ్మెల్యేను కోరారు. స్కూల్‌కు పక్కనే ఉన్న స్థలం కాబట్టి.. కలెక్టర్ తలుచుకుం టే.. సదరు స్థలాన్ని కేటాయించడం.. తేలికేనని.. ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారట. ఈ విషయంపై కలెక్టర్‌తో చర్చించాలని కూడా సూచించారట.
అయితే.. ఆ ఎమ్మెల్యే మాత్రం వెంటనే ``కలెక్టర్‌కు చదువు రాదులే`` అని టక్కునే అనేశాడట! అంతే.. ఈ మాట నియోజకవర్గం వ్యాప్తంగా హల్చల్ చేస్తోంది. ఎన్నో కష్టాలు పడి చదివి.. ఐఏఎస్ సాధించి.. జిల్లాకు కలెక్టర్ అయిన.. అధికారికి చదువు రాదు! అని టక్కున అనేయడంపై నియోజకవర్గం ప్రజలు పెదవి విరిచారు. ఇదే విషయంపై చర్చించుకోవడం గమనార్హం. అయితే.. ఒక్క కలెక్టర్‌నే కాదు.. పార్టీ నేతలనుకూడా సదరు ఎమ్మెల్యే విమర్శిస్తున్నారని.. కార్యకర్తలను కూడా ఏదో ఒక విధంగా అఅవమాన పరుస్తున్నారని అంటున్నారు.
అంతేకాదు.. సామాజిక వర్గం పరంగా కూడా కులం పేరు పెట్టి ఏదో ఒకటి అంటున్నట్టు చెప్పుకొంటున్నారు. ఇప్పటికే ఈ ఎమ్మెల్యే విషయంపై ముఖ్యమంత్రి దగ్గరకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లాయని.. ఇప్పుడు ప్రభుత్వ టీచర్లు కూడా ఎమ్మెల్యే పట్ల పెద్దగా అనుకూలంగా లేరని అంటున్నారు. మరి ఆ ఎమ్మెల్యే మారేది ఎప్పుడో.. లేక.. ముందు ముందు.. మరింత దూకుడు పెంచుతాడో.. అనేది ఆసక్తిగా మారింది.