Begin typing your search above and press return to search.

అధికారులనే వణికించిన ఎమ్మెల్యే.. ఏం చేశాడంటే?

By:  Tupaki Desk   |   1 Oct 2020 11:11 PM IST
అధికారులనే వణికించిన ఎమ్మెల్యే.. ఏం చేశాడంటే?
X
అధికారులు బిల్లులు చేస్తారో లేదో.. వారిని ఎదురిస్తే మన అభివృద్ధికి అడ్డుపడుతారని ప్రజాప్రతినిధులంతా వారికి అణిగిమణిగి ఉంటారు. కానీ ఈ ఎమ్మెల్యే మాత్రం అధికారులనే వణికించాడు.

మహబూబ్ నగర్ జిల్లా గూడురులో మండల సర్వసభ్య సమావేశం రసాభాసాగా రసవత్తరంగా సాగింది. 39 గ్రామాలకు సంబంధించి ఆరు నెలల తర్వాత జరిగిన మండల సర్వసభ్య సమావేశం అది. ముందెన్నడూ లేని విధంగా ఒక్కో అధికారి తీరును ఎమ్మెల్యే నిండు సభలో కడిగేయడం సంచలనమైంది.

ఇక ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటుకు ఎమ్మెల్యే సిఫారసు చేశారు. మరో ఇద్దరు అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. మహబూబాబాద్ జిల్లా గూడురు మండల సర్వసభ్య సమావేశం సాక్షిగా ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇలా అధికారులను వణికించారు. అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రజల ముందే కడిగేసి వారికి తనదైన శైలిలో క్లాస్ తీసుకున్నారు.

లంచాలు తీసుకున్న విద్యుత్ అధికారులకు తనే కరెంట్ షాక్ పెడుతానంటూ హెచ్చరించారు. ప్రజల ముందే ఈ తంతగం జరగడంతో వారంతా ఎమ్మెల్యే ధైర్యాన్ని మెచ్చుకున్నారు. స్థానికులంతా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి.