Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే షకీల్ కారు ప్రమాదం.. తెరవెనుక ఏం జరుగుతోంది?
By: Tupaki Desk | 24 March 2022 3:30 AM GMTతెలంగాణ ఎమ్మెల్యే షకీల్ స్టిక్కర్ తో ఉన్న కారు మహిళా యాచకులను ఢీ కొట్టిన ఘటన అనేక సంచలనాలకు వేదికగా మారింది. ప్రమాదం జరిగిన తర్వాత.. అనంతర పరిణామాలు కూడా అనేక అనుమానాలకు అవకాశం ఇస్తున్నాయి. హైదరా బాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో జరిగిన కారు ప్రమాదం ఆది నుంచి కూడా తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఈ కేసులో తాజాగా వెలుగు చూస్తున్న విషయాలు.. మరిత కలకలం రేపుతున్నాయి. ప్రమాదంలో గాయపడిన వారిని వెంటనే నిమ్స్ లో చేర్చారు. అయితే.. ఆ వెంటనే బాధితురాలు కాజల్ చౌహాన్.. ఆసుపత్రి నుంచి పారిపోయిందని వార్తలు వచ్చాయి.
అయితే.. వాస్తవానికి ఆమె మహారాష్ట్ర అహ్మద్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని బంధువులు అంటున్నారు. కారు ప్రమాదంలో గాయపడి నిమ్స్‌లో చికిత్స పొందుతున్న కాజల్ చౌహాన్‌ను నిమ్స్ నుంచి తరలించింది ఎవరనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
చికిత్స పొందుతున్న బాధితులు పారిపోయారని నిమ్స్ వైద్యులు చెబుతున్న దాంట్లో అసలు నిజం ఉందా?.. ఎందుకంటే రెండు కాళ్లు విరిగిపోయి ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న మహిళ ఎవరి సాయం లేకుండా అక్కడి నుంచి పారిపోయే ఛాన్స్ ఉంటుందా? అసలు నిమ్స్‌లో ఏం జరుగుతోంది? అనే అనుమానం తలెత్తుతోంది.
పూటగడవని స్థితిలో ఉన్న ఆ మహిళ నిమ్స్‌లో చికిత్స అందిస్తుంటే కాదని మహారాష్ట్రకు వెళ్లి.. అదీ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటుందా? కన్న బిడ్డను కళ్ల ముందే కారుతో ఢీకొట్టి చంపేసిన వాళ్లను ఏ తల్లైనా వదిలేసి వెళ్లిపోతుందా? కనీసం లేచి నిలబడలేని స్థితితో ఉన్న మహిళను మహారాష్ట్రకు అంబులెన్స్‌లో తరలించింది ఎవరనే ప్రశ్నకు ఎమ్మెల్యే షకీల్ సమాధానం చెబుతారా? ఈ మొత్తం వ్యవహారంలో అందరి వేళ్లూ ఎమ్మెల్యే షకీల్ వైపే చూపిస్తున్నాయి. కేసును తారు మారు చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. డబ్బు, హోదాను అడ్డు పెట్టుకుని ఎమ్మెల్యే షకీల్ ఈ ఘటనను తారు మారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఇక బాధితులను నోరెత్తకుండా చేసి ఊరు దాటించేసిన వాళ్లు పోలీసు కేసునూ నీరు గార్చేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. బాధితురాలు కాజల్ చౌహాన్ కేసు షీటు కూడా నిమ్స్ నుంచి మాయమైంది. మరి ఇది ఎలా జరిగింది? నడవలేని స్థితిలో.. ప్రాణాపాయస్థితిలో ఉన్న మహిళ ఆస్పత్రి గేటు దాటుతుంటే.. నిమ్స్ వైద్యులు, సిబ్బంది, సెక్యూరిటీ ఏం చేస్తున్నారనే ప్రశ్నకు సమాధానం చెప్పేవాళ్లు లేరు. ఒక మెడికో లీగల్ కేసుల్లో ఇంత నిర్లక్ష్యంగా నిమ్స్ సిబ్బంది వ్యవహరిస్తారా? అసలు నిమ్స్ సిబ్బందిని ఆడిస్తున్నదెవరనేదే ఇప్పుడు ప్రధానంగా చర్చకు వస్తున్న విషయం.
బాధితుల దీనస్థితిని షకీల్ అండ్ కో చాలా అలుసుగా తీసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిందితులను తప్పించడం కోసం బాధితులను బెదిరించి కాంప్రమైజ్ చేస్తే.. ఇక కేసే ఉండదా? ప్రమాదం జరిగి వారం రోజులు దాటినా ఇంత వరకూ ఎమ్మెల్యే షకీల్ కొడుకును(ఈయన వెనుక సీటులో ఉన్నాడని.. పోలీసులే చెబుతున్నారు) పోలీసులు ఎందుకు అదుపులోకి తీసుకోలేదు? ప్రమాదం జరిగిన రోజు ఒక వ్యక్తిని స్థానికులు చితక బాదారని అక్కడున్న వారు చెబుతున్నారు. ఆరోజు జనం చేతిలో దెబ్బలు తిన్నది షకీల్ కొడుకు రాహీలేనా? అనే ప్రశ్నకు సైతం సమాధానం చెప్పేవారు లేరు.
రాహిల్ తన్నులు తినడం చూసి ఓ ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేశారని ప్రచారం జరుగుతోంది.. పొలిటికల్ ప్రమేయంతోనే ప్రమాదం జరిగిన స్పాట్‌కు వచ్చిన పోలీసులు రాహీల్‌ను తప్పించారా..? అన్నదీ తేలాల్సి ఉంది. ప్రమాదంపై పోలీసుల దర్యాప్తులో అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. అంతకు మించి ఎవరినో తప్పించాలనే తాపత్రయం కూడా ఉందనే అనుమానాలు కలిగిస్తోంది. మొత్తంగా ఈ కేసును నీరుగార్చే ప్రయత్నాలు అయితే.. జరుగుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిపై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.