Begin typing your search above and press return to search.

మీ రెడ్లు అంతా ఒకటే.. బూతులు-వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్ హల్ చల్!

By:  Tupaki Desk   |   10 Nov 2020 10:10 AM GMT
మీ రెడ్లు అంతా ఒకటే.. బూతులు-వైసీపీ ఎమ్మెల్యే కామెంట్స్ హల్ చల్!
X
వాపును చూసి బలుపు అనుకుంటున్నాడట ఆ వైసీపీ ఎమ్మెల్యే.. వైఎస్ఆర్, వైఎస్ జగన్ ల బొమ్మ పెట్టుకొని గెలిచాడు ఆ పెద్ద మనిషి.. జగన్ గాలిలో కొట్టుకొచ్చిన ఈ ఎమ్మెల్యే ఇప్పుడు తనే ఒక సుప్రీం అని.. తన నియోజకవర్గంలో తనే బాస్ అని ఎవరి దయాదక్షిణ్యాలతో గెలవలేదంటూ బీరాలకు పోతున్నాడట.. ఎవరా ఎమ్మెల్యే.? ఏంటా కథ.? వైసీపీ అధిష్టానాన్ని ధిక్కరిస్తున్న ఆ వైసీపీ ఎమ్మెల్యే ఏం చూసుకొని ఎగిరెగిరి పడుతున్నాడన్నది ఇప్పుడు వైసీపీలో చర్చనీయాంశంగా మారిందట..

‘వైసీపీలో విచిత్రమైన పరిస్థితి ఉంది. ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి ‘మీరు మీరు ఒక్కటే.. మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పిండంట..’... అవతల రెడ్డి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి ‘మీరు రెడ్లు అంతా ఒక్కటే మేమే వేరు’ అని రాయలేని మాటలతో బూతులు మాట్లాడంట’..

‘‘నాకు ఇంత మెజారిటీ వస్తే కనీసం నాకు అపాయింట్ మెంట్ లేదు.. నన్ను పట్టించుకునే వాడు లేడు.. మీకు అయితే డైరెక్ట్ గా అపాయింట్ మెంట్ ఇస్తున్నారు. నాకు ఇంత మెజారిటీ వచ్చి ఏం లాభం..కనీసం నియోజకవర్గంలో అధికారులు కూడా వినడం లేదు’’ అని ఇంకొక రెడ్డి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి హైకమాండ్ ను బూతులు తిట్టాడంట సదురు వైసీపీ ఎమ్మెల్యే..’

ఇది హైకమాండ్ వరకు చేరిందని.. మేము అతడికి సీటు ఇవ్వడమే గొప్ప.. జగన్ ను చూసి ఓట్లు వేశారు..కానీ అతడిని చూసి కాదు అని కూడా హైకమాండ్ పెద్దలు అన్నారట..

2019 ఎన్నికల్లో వైఎస్ జగన్ ను చూసి ఓట్లు వేశారు. అది నూటికి నూరు శాతం నిజం. మొదటి నుంచి బూతులు తిట్టిన ఎమ్మెల్యే వైఎస్ఆర్ కు, వైఎస్ జగన్ కు వ్యతిరేకం. అయినా ఎమ్మెల్యేగా గెలవాలని పార్టీలోకి రానిచ్చి సీటు ఇస్తే ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం చూసి వైసీపీ శ్రేణులు ముక్కున వేలేసుకుంటున్నారట..

ఏదిఏమైనా హైకమాండ్ దగ్గరికి వెళ్లి ఆ ఎమ్మెల్యే సమస్యలు చెప్పాలి కానీ.. ఇలా బజారునపడి ఇంకొక రెడ్డి ఎమ్మెల్యే దగ్గర బూతులు తిట్టడం కరెక్ట్ కాదు అని కూడా అంటున్నారట.. రాబోయే రోజుల్లో అతడి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలని ఆ నియోజకవర్గంలో ప్రజలు అనుకుంటున్నారు..