Begin typing your search above and press return to search.

తన ఫైర్ ఎందుకు తగ్గిందో చెప్పిన రోజా

By:  Tupaki Desk   |   30 July 2019 10:54 AM GMT
తన ఫైర్ ఎందుకు తగ్గిందో చెప్పిన రోజా
X
ఏపీ అసెంబ్లీ కొనసాగుతోంది. ప్రతిపక్ష టీడీపీపై వైసీపీ మాటల దాడి కొనసాగుతోంది. టీడీపీ ప్రభుత్వంలోని ప్రతిపనిని, సంక్షేమ పథకాల్లో చోటుచేసుకున్న అవినీతిపై చర్చల సందర్భంగా వైసీపీ సభ్యులు కడిగిపారేస్తున్నారు. అయితే ఈరోజు అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర పరిణామం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఏపీ అసెంబ్లీ లాబీల్లో ఎదురెదురుగా ఎదురుపడ్డా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్- వైసీపీ ఎమ్మెల్యే రోజాల మధ్య ఆసక్తికర చర్చ జరిగినట్టు సమాచారం.. విలేకరుల ముందే ఇదంతా జరగడంతో విషయం బయటకు వచ్చింది..

రోజాను చూడగానే కల్పించుకున్న పయ్యావుల ‘రోజా ప్రసంగాల్లో మునుపటి ఫైర్ లేదని.. ఏమైందని?’ ప్రశ్నించారట. దీనికి అంతే సెటైర్ గా సమాధానమిచ్చింది రోజా.. ‘చంద్రబాబు సభలో లేకపోవడం వల్లే తన ప్రసంగంలో వాడి తగ్గిందని’ కౌంటర్ ఇచ్చిందట. బాబు సభలో ఉంటే ఆటోమేటిక్ గా తన ఫైర్ బ్రాండ్ బయటకు వచ్చి స్పీచ్ లో కనిపిస్తుందని రోజా సరదాగా పయ్యావులతో కామెంట్ చేశారని సమాచారం.

ఇక వైసీపీ బిల్లులకు మద్దతుగా మాట్లాడి జగన్ ను పొగిడిన పయ్యావుల కొంప దీసి వైసీపీలోకి వస్తున్నారా అని రోజా ప్రశ్నించినట్టు తెలిసింది. దీనికి పయ్యావుల కూడా అంతే కామెడీగా స్పందించారట. ఆ బిల్లును టీడీపీ తేవాలనుకుందని.. మీరు తెచ్చేసరికి మంచి పని చేశారని పొగిడాను తప్పితే పార్టీ మారేది లేదని పయ్యావుల సమాధానమిచ్చారట.. ఇలా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య సరదా సన్నివేశం అక్కడున్న విలేకరులను, ఇతర ఎమ్మెల్యేలను నవ్వుల్లో ముంచెత్తిందట..