Begin typing your search above and press return to search.
కదిలించిన తుపాకీ కథనం..రోజా చొరవతో స్పందించిన టీఆర్ ఎస్ సర్కార్
By: Tupaki Desk | 18 April 2020 7:50 AM GMT‘తుపాకీ’ కథనం వైసీపీ ఎమ్మెల్యే రోజాను కదిలించింది.. కరిగిపోయేలా చేసింది. ఆ బాధితుడిని ఆదుకునేందుకు స్వయంగా ముందడుగు వేసేలా చేసింది. కరోనా-లాక్ డౌన్ తో లండన్ లో చిక్కుకుపోయి అస్వస్థతకు గురై ప్రాణాలతో పోరాడుతున్న బాధితుడిని ఆదుకునేందుకు చొరవ చూపేలా చేసింది. ఓ మంచి ప్రయత్నం చేసిన రోజాకు, ఆ కథనాన్ని ప్రచురించి వెలుగులోకి తీసుకొచ్చిన ‘తుపాకీ.కామ్’పై.. స్పందించిన ఎంపీ - టీఆర్ ఎస్ సర్కారుపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.
‘తుపాకీ’. కామ్ వెబ్ సైట్ లో ఏప్రిల్ 16న ప్రచురించిన ‘నేను ఎక్కువ రోజులు ఉండేలా లేను ..ఇండియాకు తీసుకెళ్లండి!’ కథనానికి వైసీపీ ఎమ్మెల్యే రోజా స్పందించారు. వరంగల్ కు చెందిన ‘సందీప్ నాథ్ దాసి’ హైదరాబాద్ లోని ప్రముఖ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. కంపెనీ పనిలో భాగంగా గత సెప్టెంబర్ నెలలో లండన్ వెళ్ళారు. మార్చి 14న అస్వస్థత చెందారు. అయితే అక్కడ ట్రీట్ మెంట్ తీసుకుంటూనే విధులకు హాజరయ్యారు. మార్చి 16న ఒక్కసారిగా ఆయన ఆరోగ్యం విషమించింది. రుమటాయిడ్ ఆర్థ్రయిటీస్ జబ్బు చేసింది. ఈ నేపథ్యంలోనే ఇండియా కు వచ్చే ప్రయత్నం చేసాడు. కానీ అప్పటికే లండన్ లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభించింది. మార్చి 18 నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిషేధించారు. దీంతో సందీప్ నాథ్ లండన్ లో చిక్కుకుపోయారు. ప్రస్తుతం బ్రిటన్ లో లాక్ డౌన్ తో బయట కు రాలేక.. ఇండియాకు తిరిగిరాలేక.. జబ్బుతో నడవలేని స్థితిలో దుర్భర దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నాడు.
ఇప్పటికే తనను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వంలో ముఖ్య నాయకులకు.. వరంగల్ లోని అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కూడా ట్విట్టర్ ద్వారా సందీప్ నాథ్ ఆవేదన పంపించాను కానీ తగిన విధంగా స్పందన రాలేదు. మీడియాకు ఈ విషయం తెలుపగా.. రెండు రోజుల క్రితం ‘తుపాకీ.కామ్’ బాధితుడి దీనగాథను పబ్లిష్ చేసింది.
తాజాగా ఈ కథనాన్ని చదివిన వైసీపీ ఎమ్మెల్యే రోజా కదిలిపోయారు. వెంటనే తనకు తానుగా చొరవ తీసుకొని తెలంగాణ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సడ్డకుడి కుమారుడు - రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే వరంగల్ నాయకులను సంప్రదించి వివరాలు కనుక్కొన్నారు. ఆదుకునే ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే రోజా విజ్ఞప్తికి రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతోష్ వేగంగా స్పందించారు. లండన్ లో చిక్కున్న సందీప్ నాథ్ విషయం ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం దృష్టికి వచ్చిందని.. లాక్ డౌన్ తో విమానాల రాకపోకలు బంద్ కావడంతో తీసుకురాలేకపోతున్నామని.. లాక్ డౌన్ ముగియగానే తీసుకొస్తామని ఎమ్మెల్యే రోజాకు హామీ ఇచ్చారు. వరంగల్ నాయకులు సైతం ఈ విషయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు.
ఇలా వైసీపీ ఎమ్మెల్యే రోజా చొరవ తీసుకొని ‘సందీప్ నాథ్ ’ దీనగాథను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేసి అందరి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ బాధితుడి నరకయాతనను తెలంగాణ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అంతే వేగంగా తెలంగాణ ఎంపీ సంతోష్ స్పందించారు. రోజా చొరవ.. ‘తుపాకీ’ కథనం తో బాధిత కుటుంబానికి న్యాయం జరగడానికి వీలు చిక్కింది. తొందరలోనే సందీప్ నాథ్ భారత్ కు తిరిగి రావడానికి మార్గం సుగమం అయ్యింది.
సందీప్ తో పటు ఇంకా ఇలా స్ట్రక్ అయిన మన NRI లను వెనక్కి తీసుకురావాల్సిన అవసరం చాలా అర్జెంట్ గా ఉంది అని తుపాకీ మన పొలిటిషన్స్ కి వివరించింది