Begin typing your search above and press return to search.
ఢిక్కీ బలిసిన కోడి...లోకేష్ ఒకటే..ఓ మరుగుజ్జు..
By: Tupaki Desk | 27 Jan 2020 5:46 AM GMTవైసీపీ ఫైర్‌బ్రాండ్ నేత, ఎమ్మెల్యే ఆర్కే రోజా తనదైన శైలిలో మరోమారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మీడియా పాయింట్లో మాట్లాడిన ఎమ్మెల్యే రోజా ఈ సందర్భంగా వివిధ అంశాలపై స్పందించారు. పెద్దల సభ సలహా లు ఇచ్చే విధంగా ఉండాలి కానీ వివాదం సృష్టించే విధంగా ఉండరాదన్నారు. పెద్దల సభ అంటే పెద్దలను సభకు పంపించాలని కానీ దద్దమ్మలను తద్దొజనాలను పంపించరాదని రోజా ఎద్దేవా చేశారు.
వ్యవస్థలను భ్రష్టు పట్టించడం లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు డ్రైవర్ అయితే అయనకు స్టీరింగ్ ఆ పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అని రోజా విరుచుకు పడ్డారు. యనమల రామకృష్ణుడు ప్రపంచ మేధావిని అని ఫీలవుతున్నారని ఆమె ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడు శాసన మండలిలో ఎదురుగా ఛైర్మన్‌ను ప్రభావితం చేశారని ఆరోపించారు. శాసన మండలిని రద్దు చేయమని సీఎం జగన్‌మోహన్ రెడ్డిని గట్టిగా అడుగుతానని రోజా అన్నారు. 151 మంది ఎమ్మెల్యేలు తీర్మానం చేసి పంపించితే శాసన మండలి లో ఆలస్యం చేయటం సరికాదని అన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్‌పై రోజా సెటైర్లు వేశారు. లొకేష్ తీరు చూస్తుంటే....బాగా బలిసిన కోడి చికెన్ షాపు ముందు తొడ కొట్టినట్లు ఉందని ఆమె వ్యాఖ్యానించారు. కోసి ఉప్పు కారం పూసి కూర వాడుకుంటారని పేర్కొన్నారు. దమ్ముంటే శాసన మండలి రద్దు చేయమని లొకేష్ అనటం బాగా బలిసిన కోడి తీరులాగే ఉందన్నారు.