Begin typing your search above and press return to search.

కొడుకుతో కలిసి కొత్త టాలెంట్ చూపించిన రోజా

By:  Tupaki Desk   |   19 Jan 2020 5:00 AM GMT
కొడుకుతో కలిసి కొత్త టాలెంట్ చూపించిన రోజా
X
ఏ మాత్రం అవకాశం వచ్చినా వదలకుండా రాజకీయ ప్రత్యర్థులకు మాటలతో చుక్కలు చూపించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ నేత కమ్.. పుత్తూరు ఎమ్మెల్యే ఆర్కే రోజా తాజాగా మరో ఆసక్తికర ఉదంతంతో వార్తల్లోకి వచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నగరిలో హడావుడి చేసిన ఆమె.. తాజాగా చిత్తూరు జిల్లా పుత్తూరు పట్టణంలో నిర్వహించిన ర్యాలీతో హాట్ టాపిక్ గా మారారు.

బైక్ డ్రైవ్ చేసిన ఆమె.. తన కొత్త టాలెంట్ ను ప్రదర్శించారు. ప్రజాప్రతినిధిగా హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు వీలుగా ఆమె చేపట్టిన ర్యాలీని పలువురు ప్రశంసిస్తున్నారు. మరో ఆసక్తికర అంశం ఏమంటే.. హెల్మెట్ పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు మోపెడ్ ను స్వయంగా నడిపిన రోజా వెహికిల్ వెనుక ఆమె కుమారుడు ఉండటం అందరిని ఆకర్షించింది.

ర్యాలీలో తన కొడుకు కృష్ణ కౌశిక్‌‌ ను మోపెడ్ వెనుక కూర్చోబెట్టుకున్న రోజా.. పుత్తూరు పట్టణంలో చక్కర్లు కొట్టారు. హుషారుగా బైక్ నడిపిన ఆమె తీరును పలువురు ఆసక్తికరంగా చర్చించుకోవటం కనిపించింది. మద్యం మత్తులో వాహనాన్ని నడపటం.. హెల్మెట్ ధరించని కారణంగా ప్రమాదాలు చోటు చేసుకొని ఎలాంటి కష్టనష్టాలకు కారణమవుతున్న విషయాన్ని అర్థమయ్యేలా రోజా తాజా ర్యాలీ సాగినట్లుగా చెప్పాలి.