Begin typing your search above and press return to search.

జగన్ ‘మామ’ కూకట్ పల్లి కోర్టులో ఎందుకు లొంగిపోయారు?

By:  Tupaki Desk   |   24 Jun 2016 11:17 AM IST
జగన్ ‘మామ’ కూకట్ పల్లి కోర్టులో ఎందుకు లొంగిపోయారు?
X
ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిమామ.. కడప జిల్లా కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తాజాగా ఆయన తన మందీమార్బలంతో కలిసి కూకట్ పల్లి 25వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు వచ్చి లొంగిపోవటంఅందరి దృష్టిని ఆకర్షించింది. ఉన్నట్లుండి రవీంద్రనాథ్ రెడ్డి కోర్టుకు వచ్చి లొంగిపోవాల్సి వచ్చిందన్న సందేహంతో ఆరా తీస్తే అసలు విషయం బయటకు వచ్చింది.

మాదాపూర్ లోని ఒక భూమిపై రవీంద్రనాథ్ కన్నేశారని.. తన అనుచరులతో కలిసి నకిలీ పత్రాలు సృష్టించి దాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించినట్లుగా ఆరోపనలు ఉన్నాయి. ఈ ఇష్యూ మీద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు రవీంద్రనాథ్ కు వారెంట్ ఇష్యూ చేసింది. దీనిపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. బెయిల్ ఇవ్వాల్సిందిగా కోరారు.

ఆయన వినతిని తిరస్కరించిన ఉమ్మడి హైకోర్టు.. ఆయన్ను కింది కోర్టుకు వెళ్లాలని స్పష్టం చేసింది. దీంతో.. చేసేదేమీ లేక ఆయన తన లాయర్లను వెంట పెట్టుకొని కూకట్ పల్లి 25వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. మరి.. దీనిపై తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.