Begin typing your search above and press return to search.
ఎమ్మెల్యే రమేష్ క్యాంపు కార్యాలయం కూల్చివేత !
By: Tupaki Desk | 17 Sep 2020 8:30 AM GMTతెలంగాణలో అధికార పార్టీ ఎమ్మెల్యేకు అధికారులు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కూల్చివేశారు. ఈ సంఘటన వరంగల్ లో జరిగింది. చట్టానికి ఎవరు అతీతులు కారు అంటూ అధికారులు తమపని తాము చేసుకొని పోయారు. నాలాల విస్తరణలో భాగంగా ఓ శాసనసభ్యుడి క్యాంపు కార్యాలయాన్ని కూల్చివేశారు. వరంగల్ భద్రకాళి చెరువు నుంచి హంటర్ రోడ్ ప్రధాన రహదారికి వచ్చే వరదనీటి కాలువపై ఐదేళ్ల కిందట వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ క్యాంపు కార్యాలయం నిర్మించారు. అయితే , గత నెలలో కురిసిన భారీ వర్షాలకు వరంగల్ లోని పలు కాలనీలు వరద నీటిలో మునిగి , చెరువుల్ని తలపించాయి. ఆ సమయంలో గతనెలలో పురపాలక మంత్రి కేటీఆర్ వరంగల్ లో పర్యటించారు. ఆ సందర్భంగా మంత్రికి పలువురు నాలాల ఆక్రమణ, కబ్జాలపై ఫిర్యాదులు చేశారు.
దీంతో త్వరలో నాలాల విస్తరణ జరపిస్తామని ముంపు బాధితులకు మంత్రి హామీ ఇచ్చారు. దీనితో నాలాలు చెరువులు వెంట చేపట్టిన నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని అధికారుల్ని ఆదేశించారు. మంత్రి ఆదేశంతో వరంగల్, హన్మకొండ ప్రాంతాల్లో కీలకమైన వరద నీటి కాల్వలను విస్తరించేందుకు వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ప్రత్యేకంగా టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఎమ్మెల్యే అరూరి క్యాంపు కార్యాలయంపై సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో పాటు మీడియాలోనూ కథనాలు వచ్చాయి. దీనిపై ఎమ్మెల్యే రమేశ్ స్పందించి తన కార్యాలయాన్ని కూల్చివేసేందుకు సిద్ధమని ప్రకటించారు. బుధవారం ఉదయం పోలీసు బందోబస్తు మధ్య డీఆర్‌ఎఫ్ టీం సభ్యులు కూల్చివేత పనులు చేపట్టారు.