Begin typing your search above and press return to search.

అసెంబ్లీలో ఎమ్మెల్యే పోర్న్ వీడియోల వ్యవహారం... అసెంబ్లీలో రచ్చే రచ్చ!

By:  Tupaki Desk   |   7 July 2023 6:59 PM GMT
అసెంబ్లీలో ఎమ్మెల్యే పోర్న్ వీడియోల వ్యవహారం... అసెంబ్లీలో రచ్చే రచ్చ!
X
ఈ ఏడాది మార్చి నెలాఖరున త్రిపుర అసెంబ్లీలో ఆమోదయోగ్యం కాని ఒక సంఘటన తెర పైకి వచ్చిన సంగతి తెలిసిందే. నాడు త్రిపుర బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. ఆ వీడియో లో సదరు ఎమ్మెల్యే అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశం మరోసారి తెర పైకి వచ్చింది.

ఈ ఏడాది మార్చి లో త్రిపుర అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ పై చర్చ జరుగుతుండగా.. అధికార బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ తన మొబైల్ లో అశ్లీల వీడియో చూస్తున్నట్లు ఉన్న ఒక వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై నాడు విపక్షాలు తీవ్రస్థాయి లో విమర్శలు గుప్పించాయి. అయితే తాజాగా త్రిపుర అసెంబ్లీ సమావేశాల లో ఈ విషయం పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి.

అవును... త్రిపుర లో అధికార బీజేపీ ఎమ్మెల్యే జాదవ్ లాల్ నాథ్ గతం లో అసెంబ్లీలో పోర్న్ వీడియోలు చూసిన నేపథ్యం లో... ప్రతిపక్ష టిప్ర మోతా పార్టీ ఇవాళ అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టింది. అయితే దీని పై అధికార బీజేపీ అభ్యంతరం చెప్పగా.. టిప్ర మోతా తోపాటు కాంగ్రెస్, సీపీఎం ఎమ్మెల్యేలు చర్చకు పట్టుబట్టారు. అనంటరం అసెంబ్లీలో నిరసన కు దిగారు.

ఈ సందర్భంగా ఇలాంటి విషయాల ను ఊరికే వదలకూడదని.. చర్చించి అనంతరం చర్యలు తీసుకోవాల ని నినాదాలు చేశాయని తెలుస్తుంది. ఫలితం గా స్పీకర్ ఐదుగురు సభ్యుల ను సస్పెండ్ చేశారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు మరింతరెచ్చిపోయి రచ్చ చేశార ని తెలుస్తుంది. ఇదే సమయం లో అధికార ప్రతిపక్ష సభ్యులమధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగిందని తెలుస్తుంది.

ఈ ఘటన పై త్రిపుర అసెంబ్లీ స్పీకర్ బిశ్వబంధు సేన్ మాట్లాడుతూ.. ఎన్నో రకాల విషయాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతుంటాయని, వాస్తవాలు తెలుసుకోకుండా సదరు వైరల్ వీడియో పై చర్య తీసుకోలేనని చెప్పినట్లు సమాచారం.

కాగా... బహిరంగ ప్రదేశాల్లో అశ్లీల వీడియోలు చూస్తూ బీజేపీ నేతలు అడ్డంగా దొరకడం ఇదే తొలిసారి కాదు. 2012లో కర్ణాటక లోని అప్పటి బీజేపీ ప్రభుత్వానికి చెందిన ఇద్దరు మంత్రులు లక్ష్మణ్ సవాది, సీసీ పాటిల్ రాష్ట్ర అసెంబ్లీలో తమ ఫోన్ లో అశ్లీల వీడియోలు చూడటం వివాదాస్పదం కావడం తో వారు రాజీనామా చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే.