Begin typing your search above and press return to search.

వైసీపీకి ఏమైంది...మరో ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై...?

By:  Tupaki Desk   |   27 March 2023 5:16 PM GMT
వైసీపీకి ఏమైంది...మరో ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై...?
X
వైసీపీకి కంచుకోట జిల్లా నెల్లూరులో ఆ పర్టీకి ఏమైంది. దిష్టి తగిలిందా లేక చెడు గాలి సోకిందా అన్న చర్చ సాగుతోంది. వైసీపీకి సంబంధించినంతవరకూ చూస్తే 2014, 2019లలో అక్కడ ఘన విజయాలను నమోదు చేసింది. 2019లో అయితే పదికి పది సీట్లు సాధించి సైకిల్ ని తుక్కు తుక్కు చేసింది. అలాంటి నెల్లూరు జిల్లా వైసీపీలో ఆమ్మతి కెరటాలు ఎగిసిపడుతున్నాయి.

ఇప్పటికే వరసగా ఒకరి వెంట ఒకరుగా ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీని వీడిపోయారు. ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిలతో పాటు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీకి రాం రాం అనేశారు. ఇపుడు అదే జిల్లాకు చెందిన నాలుగవ ఎమ్మెల్యేగా ఒక సీనియర్ నేత పేరు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఆయన పార్టీని వీడనున్నారు అని వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి.

ఆయనే కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమ్మార్ రెడ్డి. ఆయన సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యే. తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి నుంచి రాజకీయ వారసత్వం అందుకున్నారు. 1990 దశకంలో జరిగిన ఉప ఎన్నిక ద్వారా టీడీపీ నుంచి ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. ఆ తరువాత ఆయన టీడీపీలోనే కొనసాగుతూ వచ్చారు. 2009లో టీడీపీ నుంచి గెలిచిన నల్లపురెడ్డి జగన్ వెంట నడిచిన తొలి ఎమ్మెల్యేగా జిల్లాలో గుర్తింపు పొందారు.

అలాంటి నల్లపురెడ్డికి 2019 ఎన్నికల తరువాత మంత్రి పదవి ఖాయమని అంతా భావించారు. కానీ దక్కలేదు. మలి విడతలో అయినా మంత్రిని చేస్తారు అనుకుంటే ఆ ముచ్చటా తీరలేదు. దాంతో నాటి నుంచే ఆయన అసంతృప్తిగా ఉన్నారని చెప్పుకుంటున్నారు. ఇక ఆయనకు అంతకంటే మరిన్ని ఇబ్బందులు ఏంటి అంటే తాను నియోజకవర్గంలో చేసిన పనులకు కూడా ప్రభుత్వం నుంచి బిల్లులు చెల్లించడం జరగలేదని వాపోతున్నారు.

అంతే కాదు తనకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వబోమని సంకేతాలు ఇస్తున్నారని,తన పనితీరు బాలేదని పార్టీ అధినాయకత్వం మీడియాకు లీకులు ఇవ్వడం పట్ల కూడా నల్లపురెడ్డి తెగ ఫీల్ అవుతున్నారుట. ఇంతలా అవమానిస్తున్న పార్టీలో ఎందుకు ఉండాలన్న ఆలోచనలో ఆయన ఉన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే హోరెత్తుతోంది.

తనను అన్ని రకాలుగా నిర్లక్ష్యంగా చూస్తున్న వైసీపీకి దూరం జరగడమే మేలు అన్న భావనతో నల్లపురెడ్డి ఉన్నారని అంటున్నారు. తాజాగా ఆయన తనకు పార్టీలో కనీస గౌరవం లేదు ఎందుకు కొనసాగాలని అని అనుచరుల వద్ద ఆవేదన చెందినట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం అయితే చక్కర్లు కొడుతోంది.

తాను పార్టీ మారడం తప్ప వేరే మార్గం లేదని అనుచరులతో తమ ఆవేదనను ఆయన పంచుకున్నట్లుగా గాసిస్ప్ అయితే సోషల్ మీడియా ద్వారా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా నల్లపురెడ్డి తెలుగుదేశం నుంచి వచ్చారు. అయితే చంద్రబాబుతో ఆయన విభేదిస్తున్నారు. ఆయన మీద ఒక లెవెల్ లో విమర్శలు చేసి ఉన్నారు.

దాంతో ఇపుడు తెలుగుదేశం పార్టీలో వెళ్లడం సాధ్యపడదు, బీజేపీలోకి వెళ్లాలనుకున్నా అక్కడ చేరినా చేరకపోయినా ఒక్కటే అని అంటున్నారు. దాంతో స్వతంత్రంగా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తన సత్తా చాటుకుని ఆ మీదట అప్పటి రాజకీయ పరిస్థితులను బట్టి పార్టీలలో చేరే విషయం ఆలోచించవచ్చు అన్నదే ప్రసన్నకుమార్ రెడ్డి ఆలోచనగా చెబుతున్నారు.

అయితే ఇవన్నీ కూడా ప్రచారంలో ఉన్నవే తప్ప ఎక్కడా వీటికి క్లారిటీ అయితే లేదు. కానీ వైసీపీలో చాలా మంది ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు అన్నది మాత్రం వాస్తవం అంటున్నారు. రాజకీయాల్లో విధేయతలు పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి ప్రసన్నకుమార్ రెడ్డి ఏమైనా చేసినా చేయవచ్చు అన్నది ఈ రోజుకు గాసిప్. రేపు ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియదు. సో వేచి చూడడమే అంటున్నారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.